Ad Code

ఓటీటీలో సరికొత్త రికార్డు సృష్టించిన '#90s' వెబ్‌సిరీస్‌ !


టీటీ వేదికలు సినిమాలకు దీటుగా వెబ్‌సిరీస్‌లను రూపొందిస్తూ ప్రేక్షకులకు మరింత చేరువ అవుతున్నాయి. యువతతో పాటు, కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని, ఓటీటీ సంస్థలు కంటెంట్‌ను తీసుకొస్తున్నాయి. అలా వచ్చి చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరినీ అలరించిన వెబ్‌సిరీస్‌ '#90s'. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో వచ్చిన ఈ సిరీస్‌ మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అంతేకాదు, ఇప్పుడు మరో సరికొత్త రికార్డును క్రియేట్‌ చేసింది. 2024 తొలి అర్ధభాగంలో దేశవ్యాప్తంగా అత్యధికమంది లైక్‌ చేసిన తెలుగు సిరీస్‌గా నిలిచింది. ఓటీటీ వేదికగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లను విశ్లేషించి, రేటింగ్స్‌ ఇచ్చే ఓర్‌మ్యాక్స్‌ ఈ సర్వేను నిర్వహించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిర్మాత నవీన్‌ మేడారం ఆనందం వ్యక్తం చేశారు. సిరీస్‌ కోసం పనిచేసిన నటీనటులు, సాంకేతిక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు, త్వరలోనే సీజన్‌-2, సీజన్‌-3 కూడా తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా దర్శకుడు ఆదిత్య హాసన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ఈటీవీ ఎప్పుడూ ముందుంటుందని, వచ్చే ఏడాది ప్రతి నెలా ఒక సినిమా లేదా సిరీస్‌తో ప్రేక్షకులను అలరిస్తామని తెలిపారు. వీటి ద్వారా పలువురు కొత్త దర్శకులు పరిచయం కాబోతున్నట్లు వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu