'ఎక్స్'లో వీడియోలను లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంటారు. అయితే ఇప్పటి వరకు ఈ లైవ్ స్ట్రీమింగ్‌లను ఉచితంగా చూసుకునే అవకాశం ఉంది. కాగా త్వరలో ఎక్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేయాలంటే కచ్చితంగా డబ్బులు చెల్లించాల్సిందేనని తెలుస్తోంది. కేవలం ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారికి మాత్రమే లైవ్ స్ట్రీమింగ్ చేసే అవకాశం ఇవ్వనున్నట్లు ఎక్స్ తన అకౌంట్‌లో అధికారికంగా ప్రకటించింది. రాబోయే రోజుల్లో కేవలం ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లు మాత్రమే 'ఎక్స్'లో లైవ్ స్ట్రీమ్ (క్రియేట్ లైవ్ వీడియో స్ట్రీమ్) చేయగలరు. ఇందులో ఎక్స్ ఇంటిగ్రేషన్‌తో ఎన్‌కోడర్ నుంచి లైవ్ కూడా ఉంటుంది. ఈ లైవ్ కొనసాగించడానికి యూజర్లు ప్రీమియంకు అప్‌గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కంపెనీ దీనికి సంబంధించి ఓ ప్రకటన వెల్లడించినప్పటికీ.. ఇది ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనే విషయాన్ని కంపెనీ ఇంకా అధికారింగా వెల్లడించలేదు. ఇదిలా ప్రస్తుతం ఎక్స్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధర రూ. 215 నుంచి మొదలవుతుంది.
0 Comments