Ad Code

త్వరలో దేశీయ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ?


దేశీయ మార్కెట్లో అతి త్వరలో మెర్సిడెస్-బెంజ్ ఇండియా నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కారు లాంచ్ చేసేందుకు ఈక్యూఏ మోడల్ రెడీగా ఉంది. ఈక్యూఏ ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ భారత మార్కెట్లో నాల్గవ ఈవీ కారు అవుతుంది. ఇప్పటివరకూ మొత్తం ఆరు మోడళ్లను ప్రవేశపెట్టింది. అందులో EQB SUV, EQE SUV, EQS మోడల్ ఎస్‌యూవీలు ఉండగా కొత్తగా EQA మోడల్ ఒకటి వచ్చి చేరింది. దాంతో ఈక్యూఏ ఎస్‌యూవీ మోడల్.. బీఎండబ్ల్యూ ఎక్స్1, వోల్వో ఎక్స్‌సీ40 రీఛార్జ్, కియా ఈవీ6తో పోటీపడుతుంది.మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఫేస్‌లిఫ్ట్ గత ఏడాది ఆగస్టులో రివీల్ అయింది. బయటి నుంచి మెర్సిడెస్-బెంజ్ సిగ్నేచర్ స్టార్ ప్యాటర్న్, ఒక హెడ్‌ల్యాంప్ నుంచి మరో హెడ్‌ల్యాంప్ వరకు విస్తరించి ఉన్న లైట్ బార్‌తో ఫ్రంట్ గ్రిల్ అత్యంత అద్భుతమైన ఫీచర్‌లలో ఒకటిగా ఉంది. డిజైన్ లాంగ్వేజీ పరంగా ఈక్యూఏ ఈక్యూబీతో చాలా అంశాలను షేర్ చేసింది. లోపలి భాగంలో ఈక్యూఏ మోడల్ 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ భారత మార్కెట్లో విక్రయించనున్న ఇతర మెర్సిడెస్ మోడళ్లలో కనిపించే మూడు-స్పోక్ స్టీరింగ్ వీల్‌తో వస్తుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ల పరంగా మెర్సిడెస్ బెంజ్ ఇంకా ఈక్యూఏ గురించి ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అంతర్జాతీయ మార్కెట్లలో ఈక్యూఏ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రెండు బ్యాటరీ ఆప్షన్లతో పాటు నాలుగు వేరియంట్‌లతో వస్తుంది. ఇందులో ఈక్యూఏ 250, ఈక్యూఏ 250 ప్లస్, ఈక్యూఏ 300 4మ్యాటిక్, ఈక్యూఏ 350 4మ్యాటిక్ ఉన్నాయి.


Post a Comment

0 Comments

Close Menu