బ్రెజిల్‌లోని పోర్టో వెల్హో నగరానికి సమీపంలో భారీ అనకొండ హైవే రోడ్డుపైకి చేరుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డు దాటేందుకు ఎలా ప్రయత్నిస్తుందో వీడియోలో చూడొచ్చు. కొండచిలువ రోడ్డు దాటు తున్న సమయంలో కొంతమంది యువకులు కొంచెం దూరంలో దానిని ఫాలో అవుతున్నారు. అదే సమయంలో కొండచిలువ రోడ్డు దాటడం మొదలు పెట్టింది మొదలు.. అది రోడ్డు దాటి గడ్డి దుబ్బుల్లోకి చేరుకునే వరకూ రోడ్డుమీద తమ వాహనాలను ఆపివేశారు. దీంతో కొండచిలువ పాకుతూ తన భారీ కాయాన్ని సులభంగా రహదారి దాటించి అడవిలోకి తీసుకుని వెళ్ళింది. ఇలా అనకొండను రోడ్డు దాటు తున్న సమయంలో వీడియో తీసే పనిలో నిమగ్నమై ఉన్న చాలా మంది వ్యక్తులు కూడా అక్కడ నిలబడి ఉన్నారు. అనకొండ నాలుగు మీటర్ల పొడవు, 30 కిలోల బరువు ఉంటుందని పేర్కొన్నారు.
0 Comments