మెక్సికోలోని హిడాల్గోకు చెందిన కొంత మంది స్టీమ్ ఇంజన్ రైలును చూడడానికి రైల్వే ట్రాక్‌పై నిలబడి చూస్తున్నారు. అక్కడివారంతా ఈ రైలుతో సెల్ఫీలు, వీడియోలు తీసుకోవాలని ఆరాటంగా ఉన్నారు. ఎందుకంటేఇది ఆవిరి మీద నడిచే ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఒక యువతి రైలుతో సెల్ఫీ వీడియో తీస్తున్న సమయంలో రైలు మెరుపు వేగంతో దూసుకొచ్చి ఢీకొట్టింది. దాంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పక్కనే ఉన్న ఆమె స్నేహితులు ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపు ఈ ఘోరం జరిగిపోయింది. ఊహించని ప్రమాదంతో యువతి మృతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియో ఇలాంటి వారంతా గుణపాఠం నేర్చుకోవాలని అంటున్నారు. ఇలా రీల్స్ పిచ్చితో తిరిగే వారు మన భద్రతను మనం తప్పక చూసుకోవాలంటున్నారు.. చిన్నపాటి అజాగ్రత్త ప్రాణాలను బలిగొంటుంది అనడానికి ఇప్పటి వరకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
0 Comments