బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌కి కొత్తగా ఎన్నికైన సభ్యులు మోడీని తమ నాయకుడిగా ఎన్నుకోవడానికి పార్టీ సమావేశం కోసం పార్లమెంటు లోపల సమావేశమయ్యారు. పార్లమెంటు ఆవరణలోనే ఎంపీలందరికీ సన్మానం నిర్వహించగా, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా నేతలతో భేటీ అయ్యారు. మోడీ పేరును రాజ్ నాథ్ సింగ్ ప్రతిపాదించగా అమిత్ షా బలపరిచారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ఎన్డీయే పక్షనేతగా మోడీ మూడోసారి బాధ్యతలు తీసుకోవడం చారిత్రాత్మకమన్నారు. మోడీని ఎన్డీయే నాయకుడిగా ఎన్నుకున్న తర్వాత, కూటమిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , జేడీ (యు) అధినేత నితీష్ కుమార్ వంటి కొంతమంది సీనియర్ సభ్యులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశానికి ప్రధానితో కలిసి జాబితాను ఆమెకు అందించనున్నారు.
0 Comments