Ad Code

ప్రధానమంత్రి సామాన్యుడి వైపా ? బిలియనీర్ల వైపా ?


ప్రధానిగా మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భరంగా కాంగ్రెస్‌  ప్రశ్నలు సంధించింది. కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న ఆర్థిక మంత్రి దీనికి మద్దతు ఇస్తారా? అని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. ప్రధానమంత్రి సామాన్యుడి వైపు ఉంటారా? లేకా బిలియనీర్ల వైపు నిలబడతారా? అని అడిగింది. ''సామాన్యుల వైపు ఉంటారా? లేదా బిలియనీర్ల వైపు నిలబడతారా? అనే విషయం నిరూపించేందుకు ఈ ఏడాది ఓ అవకాశం రానుంది. బ్రెజిల్‌లో జరిగే జీ20 సమావేశంలో బిలియనీర్లపై పన్ను విధించే ప్రతిపాదనపై చర్చ జరగనుంది. దీనికి బ్రెజిల్‌, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, దక్షిణాఫ్రికా, జర్మనీల ఆర్థిక మంత్రులు మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో భారత తదుపరి ఆర్థిక మంత్రి దీన్ని సమర్థిస్తారా?'' అని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ జైరాం రమేశ్‌ ప్రశ్నించారు. వ్యవస్థలో లోపాలు, షెల్‌ కంపెనీలు, ఇతర మార్గాలను ఉపయోగించుకొంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిలియనీర్లు శ్రామిక వర్గం కంటే తక్కువ పన్నులు కడుతున్నారని కాంగ్రెస్‌ నేత ఆరోపించారు. ఈ క్రమంలోనే న్యాయమైన వాటా చెల్లించేందుకు గాను బిలియనీర్లపై గ్లోబల్‌ మినిమమ్‌ టాక్స్‌ చెల్లించే అంశంపై జీ 20లో చర్చ జరగనుందన్నారు.

Post a Comment

0 Comments

Close Menu