బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌కి రెమల్‌గా నామకరణం చేశారు. రుతుపవనాల రాకకు ముందుగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో తుఫాన్ ఏర్పడింది. రెమల్ తుఫాను ఆదివారం పశ్చిమ బెంగాల్‌కు చేరుకోనుంది. దీని ప్రభావంతో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం నాటికి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాలకు చేరుకుంటుందని కేంద్ర వాతావరణ శాఖ గురువారం తెలిపింది. శుక్రవారం ఉదయానికి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని, ఇది శనివారం ఉదయం తుఫానుగా మరింత బలపడి ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారనుంది. బంగ్లాదేశ్ దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకుంటుందని భారత వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త మోనికా శర్మ తెలిపారు.
0 Comments