కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ' భారతీయుడు 2'. 1996లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన 'భారతీయుడు' మూవీకి సీక్వెల్‌గా ఇప్పుడు ' భారతీయుడు 2' రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జులైలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాగా, ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకను జూన్ 1న చెన్నైలో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారని సమాచారం. ఈ చిత్రానికి సేన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్న సంగతి తెలిసిందే..
0 Comments