ప్రపంచ విద్యుత్ వాహన రంగంలో భారత్ కీలక మార్కెట్‌కు చేరుకోనుందని గోల్డ్‌మాన్ సాచే అంచనా వేసింది. 2040 నాటికి గ్లోబల్ ప్యాసింజర్ వెహికల్ (పివి) మార్కెట్‌లో 7 శాతం వాటాను పొందొచ్చని పేర్కొంది. భారత్ ప్రస్తుతం ఒక్క శాతం మార్కెట్ వాటాను మాత్రమే కలిగి ఉంది. 2024 అంచనాల ప్రకారం ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 2023 నాటికి దాదాపు లక్ష కంటే ఎక్కువ లేదా తక్కువ స్థాయిలోనే ఉంటాయని గోల్డ్‌మాన్ సాచే అంచనా వేసింది. 2030 నాటికి 13 లక్షల యూనిట్ల మార్క్‌ను, 2040 నాటికి 55 లక్షల యూనిట్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. ఇతర దేశాలతో పోలిస్తే ఇవి వాహనాల మార్కెట్ విస్తరణలో భారత్ చాలా వెనుకబడి ఉంది. ప్రపంచ సగటు కంటే చాలా తక్కువగా ఉంది. భారత మొత్తం వాహన అమ్మకాల్లో 2026 నాటికి ఇవిల వాటా 7 శాతంగా, 2030లో 21 శాతం, 2040 నాటికి 57 శాతానికి చేరుకోవచ్చు. అదే అమెరికాలో 2030 నాటికి 34 శాతం, 2040 నాటికి 62 శాతం ఇవి వాహనాలు ఉండొచ్చని అంచనా. జపాన్, చైనా, ఇయు, భారత్ దేశాల్లోని ఇవి పురోగతి మిగితా ప్రపంచంపై ప్రధానంగా ఉంటుంది. విద్యుత్ వాహన రంగంలో 30 శాతం వృద్థి రేటును సాధించాలనే నీతి అయోగ్ లక్ష్యం కంటే సవరించిన అంచనాలు భారీగా తగ్గాయి. దీంతో ఇవి పరిశ్రమను ప్రోత్సహించడానికి కేంద్రం ఇటీవల ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (ఇఎంపిఎస్)ను ప్రవేశపెట్టింది. ఈ పథకం జూన్ 2024తో ముగుస్తుంది. నాలుగు నెలల పాటు అమల్లో ఉండే ఇఎంపిఎస్‌లో భాగంగా ప్రతి ద్విచక్ర వాహనానికి రూ.10,000 వరకు రాయితీని అందిస్తుంది. తేలికపాటి త్రీవీలర్‌కు రూ.25,000 (ఇ-రిక్షాలు వంటివి), భారీ త్రీ వీలర్‌కు రూ.50,000 (ఆటోలు మరియు వాణిజ్య యూనిట్లు వంటివి) రాయితీలు లభించనున్నాయి. ఇవి విభాగంలో టాటా మోటార్స్ ప్రస్తుతం టియాగో, నెక్సాన్, టిగోర్, పంచ్ వంటి మోడళ్లతో ఇవి మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది, తర్వాత ఎంజి మోటార్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెట్‌పై పట్టునకు ప్రయత్నిస్తున్నాయి.
0 Comments