Ad Code

దేశీయ మార్కెట్లో ఫ్లిక్స్‌బస్ సర్వీసులు !


దేశీయ మార్కెట్లో   ఫ్లిక్స్‌బస్ అధికారికంగా సర్వీసులను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద బస్ మార్కెట్ కలిగిన ఫ్లిక్స్‌బస్ అగ్రశ్రేణి భద్రతా ప్రమాణాలతో పాటు పోటీ ధరలకు అనుకూలమైన ప్రయాణ ఎంపికలను అందిస్తోంది. తద్వారా ఇంటర్‌సిటీ ప్రయాణీకుల రవాణాను మార్చాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్లిక్స్‌ సీఈఓ ఆండ్రి మాట్లాడుతూ 'ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద బస్ మార్కెట్‌లలో ఒకటైన మా ఉనికిని గుర్తించడం ద్వారా భారత మార్కెట్లోకి ఫ్లిక్స్‌బస్ సర్వీసులను విస్తరించడం పట్ల సంతోషంగా ఉంది. భారత్‌లో స్థిరమైన, సురక్షితమైన సరసమైన ధరలకే ప్రయాణ సదుపాయాలను అందించడమే మా లక్ష్యం' అని పేర్కొన్నారు. ఫ్లిక్స్‌బస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సూర్య ఖురానా మాట్లాడుతూ భద్రత, సౌకర్యం, తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణాలను అందించడం ద్వారా భారత మార్కెట్లో సేవలను పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ట్రాఫిక్ రద్దీ, ఉద్గారాలను తగ్గించడానికి వృద్ధి, సామర్థ్యంపై దృష్టి సారిస్తూ, స్థానిక ఆపరేటర్‌లతో సహకారంపై విజయం ఆధారపడి ఉంటుందని చెప్పారు. కంపెనీ న్యూఢిల్లీ, హిమాచల్, జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అంతటా ప్రధాన నగరాలు, అనేక మార్గాలను కలుపుతుంది. ఈ నెల 1 నుంచే ఫ్లిక్స్‌బస్ ఇండియా నుంచి టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ మార్గాలు కేవలం రూ. 99 ప్రత్యేక ధరతో ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమవుతాయి. ఈ మార్గాలు ఢిల్లీని అయోధ్య, చండీగఢ్, జైపూర్, మనాలి, హరిద్వార్, రిషికేశ్, అజ్మీర్, కత్రా, డెహ్రాడూన్, గోరఖ్‌పూర్, వారణాసి వంటి కీలక ప్రాంతాలతో కలుపుతాయి. జోధ్‌పూర్, ధర్మశాల, లక్నో అమృత్‌సర్. నెట్‌వర్క్‌లో 59 స్టాప్‌లు, మొత్తం 200 కనెక్షన్‌లు ఉంటాయని కంపెనీ తెలిపింది.


Post a Comment

0 Comments

Close Menu