ఇన్ స్టాగ్రామ్ లో మరో కొత్త అప్డేట్ వచ్చేసింది. క్లోజ్ ఫ్రెండ్స్ ను ఈ ఫీచర్ మరింత దగ్గర చేస్తుంది. అకౌంట్లలోని స్టోరీస్, నోట్స్‌తో పాటు పోస్ట్‌లు, రీల్స్‌ని ఎంపిక చేసుకున్న స్నేహితుల గ్రూపుతో ఈజీగా షేర్ చేసుకోవచ్చు. ఈ మేరకు మార్క్ జుకర్‌బర్గ్ కొత్త అప్‌డేట్‌ను ప్రకటించారు.. ఈ ఫీచర్ వల్ల షేర్ చేసిన రీల్స్, పోస్ట్‌లపై స్టోరీలు, లైక్స్, కామెంట్‌లు సన్నిహిత స్నేహితుల జాబితాలోని ఇతర సభ్యులకు మాత్రమే కనిపిస్తాయి. ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ని ఓపెన్ చేసి మీ ఫీడ్‌కి వెళ్లి కొత్త పోస్ట్‌ను క్రియేట్ చేసేందుకు స్క్రీన్ దిగువన ఉన్న ‘ప్లస్ ‘ ఐకాన్‌పై నొక్కండి. క్రియేట్ చేయాలనుకునే పోస్ట్ టైప్ ఎంచుకోండి. ఫోన్ గ్యాలరీ నుంచి షేర్ చేయాలనుకుంటున్న ఫొటో లేదా వీడియోను ఎంచుకోండి. పోస్ట్‌కు క్యాప్షన్ ఏదైనా అవసరమైతే ఎడిట్ చేసుకోండి. రీల్‌కి ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్ మ్యూజిక్ జోడించడానికి ఎడిట్ టూల్స్ ఉపయోగించండి. క్యాప్షన్ బాక్స్ దిగువన ఉన్న ‘Audience’ ఆప్షన్‌పై నొక్కండి. ఆప్షన్ల జాబితా నుంచి ‘Close Friends’ ఎంచుకోండి.. అంతే ఈ ఫీచర్ ను మీరు ఎంజాయ్ చెయ్యొచ్చు.మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు పాటల సాహిత్యాన్ని జోడించే ఆప్షన్ ప్రవేశపెట్టింది. ఇది స్టోరీస్‌లో అందుబాటులో ఉన్న ఫీచర్‌ను పోలి ఉంటుంది. ఈ ఫీచర్‌ని ఉపయోగించడానికి.. మీ రీల్‌ని ఎడిట్ చేస్తున్నప్పుడు లిరిక్స్ బటన్‌ను ట్యాప్ చేయండి.. లిరిక్స్ ను ఎంజాయ్ చెయ్యవచ్చు.. అలాగే కొత్త ఫీచర్‌తో ప్రయోగాలు చేస్తోంది. వినియోగదారులు తమ డైరెక్ట్ మెసేజ్‌లను చదివినప్పుడు ఇతరులు చూడగలరో లేదో కంట్రోల్ చేసేందుకు వీలు కల్పిస్తుంది.. వాట్సాప్ ఫీచర్ లాగే ఉంటుంది.. త్వరలోనే ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని రానుంది.
0 Comments