Ad Code

అపరూప్ రాయ్ అసమాన ప్రతిభ !


పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ జూమ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో 11వ తరగతి చదువుతున్నఅపరూప్ రాయ్ 17 ఏళ్ల వయసులోనే అమెరికాలోని టెస్లా, నాసా వంటి సంస్థలతో కలిసి పనిచేస్తున్నాడు. ఇప్పటికే రెండు పుస్తకాలు, మూడు పరిశోధక పత్రాలు సమర్పించాడు. ఆ పత్రాలు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ కెమికల సైన్సెస్, జర్నల్ ఆఫ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆఫ్ మెటెరియల్స్ లో ప్రచురితమయ్యాయి. ఈ మూడు పరిశఓధక పత్రాలూ గత ఏడాది అపరూప్ రాయ్ 10వ తరగతిలో ఉన్న సమయంలోనే ప్రచురితం కావడం గమనార్హం. అలాగే, అపరూప్ మొదటి పుస్తకం 'సాధారణ రసాయన శాస్త్రంలోని సమస్యలు' 2021 మేలో ప్రచురితమైంది. అతడి రెండో పుస్తకం 'మాస్టర్ ఐసీఎస్ఈ కెమిస్ట్రీ సెమిస్టర్' 2021 ఆగస్టులో ముద్రితమైంది. ఇస్రో శాస్త్రవేత్త కావడమే తన లక్ష్యమని చెబుతున్నాడు. అపరూప్ రాయ్ ఏడవ తరగతి నుంచి బైజూస్ యాప్ ను కూడా తెగవాడేస్తూ, రసాయన, గణితశాస్త్రాలకు సంబంధించిన అనేక విషయాలు తెలుసుకున్నాడు. కరోనా సమయంలో లాక్ డౌన్ లో రసాయన శాస్త్రంపై మరింత పట్టుసాధించాడు. ఆ సమయంలోనే రసాయన శాస్త్రానికి సంబంధించిన పలు పరిశోధనలు చేసి, కొత్త విషయాలను కనుక్కున్నాడు. లాక్ డౌన్ సమయంలో పోలీసులు ఎవరినీ బయటకు రానివ్వలేదని, ఆ సమయంలో తాను ఇంట్లోనే ఉండి పరిశోధనలు చేశానని చెప్పాడు. దుర్గాపూర్ ఎన్ఐటీ రసాయన శాస్త్ర విభాగానికి తన పరిశోధనలకు సంబంధించిన వివరాలు తెలిపానని, ప్రొఫెసర్ల సాయంతో తన పాఠశాల నుంచి తన పరిశోధనలకు సంబంధించిన అనుమతి పత్రాన్ని తెచ్చుకున్నానని చెప్పాడు. తాను ప్రస్తుతం ఎన్ఐటీ ల్యాబ్ లో పరిశోధనలు కొనసాగిస్తున్నానని తెలిపాడు. అక్కడితో అతడి పరిశోధన ప్రయాణం ఆగిపోలేదు. ప్రస్తుతం అపురూప్ టెస్లాలో పరిశోధక సహాయకుడిగా పనిచేస్తున్నాడు. ఇప్పటికే ఇందులో అతడికి రెండేళ్ల అనుభవం ఉంది. అలాగే, నాసా శాస్త్రవేత్తలతోనూ పరిశోధక సహాయకుడిగా పనిచేస్తున్నాడు. అణువు, తటస్థ విద్యుదావేశం, రసాయన బంధాలు వంటి వాటి గురించి ఏడో తరగతి నుంచే తనకు ఆసక్తి కలిగిందని చెప్పాడు. ప్రస్తుతం జేఈఈలో మంచి ర్యాంకు కోసం ప్రయత్నిస్తున్నానని, ఐఐటీ బాంబేలో చదవాలని ఉందని తెలిపాడు. అతడిని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ప్రశంసించింది. కొవిడ్-19 సవాళ్లపై పలు అంశాలు తెలిపినందుకు అతడు నాసా, ఈఎస్ఏ, జేఈఎక్స్ఏ వంటి సంస్థల నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు కూడా అందుకున్నాడు.

Post a Comment

0 Comments

Close Menu