మన దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లే ఎక్కువగా వాహనదారులకు అందుబాటులో ఉన్నాయి. స్కూటర్లే కాకుండా ఇతర బైక్ మోడల్స్‌పై కూడా పలు కంపెనీలు దృష్టిసారిస్తున్నాయి. భారత్‌లో తొలి ఎలక్ట్రిక్ క్రూజర్ బైక్‌ను కొమాకి త్వరలో విడుదల చేయబోతోంది. ఈ క్రూయిజర్‌కు కొమాకి రేంజర్ అని పేరు పెట్టనున్నారు. దీనికి ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 250 కిమీల వరకు వెళ్తుంది. ఇది భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్. వచ్చే ఏడాది జనవరిలో కంపెనీ కొమాకి రేంజర్‌ను విడుదల చేస్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కంపెనీ వెబ్‌సైట్‌లో బైక్ ఫోటోలను ఉంచారు కొమాకి రేంజర్ క్రూజర్ బైక్‌లో ముఖ్యమైన ఫీచర్లుగా క్రూయిజ్ కంట్రోల్, రిపేర్ స్విచ్, రివర్స్ స్విచ్, బ్లూటూత్ సిస్టమ్ , అధునాతన బ్రేకింగ్ సిస్టమ్‌తో రానుంది. కొమాకి రేంజర్‌లో 4-కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. దీంతో 250 కిమీల మేర రేంజ్‌ను అందిస్తోందని కంపెనీ చెప్తుతోంది. 5000-వాట్ల మోటారుతో పనిచేయనుంది.
0 Comments