రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ ఇవాళ ఓ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. ఇమ్మిడియేట్ పేమెంట్ సర్వీస్(ఐఎంపీఎస్) లావాదేవీ పరిమితిని రూ.5 లక్షలకు పెంచినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఒక ట్రాన్జాక్షన్‌పై 2 లక్షల పరిమితి ఉన్న విషయం తెలిసిందే. ఐఎంపీఎస్ వ్యవస్థకు చాలా ప్రాముఖ్యత పెరిగిందని, వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించాలన్న నేపథ్యంలో.. ఐఎంపీఎస్ లిమిట్‌ను 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచేందుకు ప్రతిపాదన చేసినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ఆర్బీఐ ద్రవ్యపరపతి కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఇవాళ ఆయన వెల్లడించారు. పాయింట్ ఆఫ్ సేల్స్(పీఓఎస్), క్విక్ రెస్పాన్స్(క్యూఆర్) కోడ్ల వల్ల లావాదేవీలను పెంచేందుకు కూడా ఆర్బీఐ ఓ నిర్ణయం తీసుకున్నది. పీఏ సదుపాయాలు లేని ప్రాంతాలను టార్గెట్ చేసి, అక్కడ జియో ట్యాగింగ్ టెక్నాలజీని పెంపొందించనున్నట్లు ఆయన తెలిపారు. ఇక వడ్డీ రేట్లను యధాతథం ఉంచారు. వరుసగా ఎనిమిదోసారి కూడా ఆర్బీఐ వడ్డీ రేట్లను మార్చలేదు. రెపో రేటు 4 శాతంగా, రివర్స్ రెపో రేటు 3.35 శాతం ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ చెప్పారు.
0 Comments