గుజరాత్ రాష్టం లోని అహ్మదాబాద్ నగరంలోని సీజి రోడ్డులో ఏర్పాటు చేసిన స్మార్ట్ విద్యుత్ పోల్స్ ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటున్నాయి. మొత్తం ఇప్పటి వరకు 19 విద్యుత్ స్థంభాలను ఏర్పాటు చేశారు. దేశంలో మరెక్కడాలేనటువంటి టెక్నాలజీని ఈ విద్యుత్ పోల్స్ లో వినియోగించారు. చైనాలో తయారైన ఈ విద్యుత్ పోల్స్ అనేక సాంకేతికలను కలిగి ఉన్నాయి. ఒక్కో పోల్ ఖరీదు అక్షరాల 2కోట్ల రూపాయలు. ఈ పోల్స్ అనేక రకాల ఫీచర్లు కలిగి ఉన్నాయి. వైఫే, యూఎస్ బి ఛార్జింగ్, సిసి కెమెరా, బిల్ బోర్డు డిస్ ప్లే, ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్, స్పీకర్, ఇలా అనేక రకాల సదుపాయాలు ఈ విద్యుత్ పోల్ కలిగి ఉంది. ఈ పోల్స్ లో రెండు రకాలు ఉన్నాయి. ఒక మీటర్ స్మార్ట్ పోల్, పది మీటర్ల స్మార్ట్ ఫోల్ గా రకాలు ఉన్నాయి. పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ పోల్స్ ను ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ప్రస్తుతానికి ఇవి ఇంకా వినియోగం లోకి రాలేదు. డిజిటల్ డేటా మొత్తాన్ని స్ధానికంగా ఉండే సర్వర్లలో స్టోర్ అయ్యే విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది. ఆప్రక్రియ పూర్తయిన అనంతరం వాటిని పూర్తిస్ధాయిలో వినియోగంలోకి తీసుకురానున్నారు.
0 Comments