Ad Code

టాప్ 10 డౌన్లోడెడ్ యాప్స్


గూగుల్ ప్లేస్టోర్ ఇంకా యాపిల్ యాప్ స్టోర్‌లో 2021 వ సంవత్సరంలో ఎక్కువగా డౌన్‌లోడ్ చేసిన యాప్స్ వివరాలను సెన్సార్ టవర్ రిలీజ్ చేయడం జరిగింది. జనవరి నుంచి జూన్ వరకు ఈ ఆరు నెలల్లో ఎక్కువగా డౌన్‌లోడ్ చేసిన టాప్ 10 యాప్స్ ఇవే. 

1. ఫేస్ బుక్ : సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఫేస్ బుక్ గూగుల్ ప్లేస్టోర్‌లో టాప్‌ 1లో నిలవగా, యాపిల్ యాప్ స్టోర్‌లో ఫేస్ బుక్ 6వ స్థానంలో నిలిచింది. 

2. టిక్ టాక్ : ఫేస్ బుక్ తరువాత స్థానంలో టిక్ టాక్ నిలిచింది. టిక్ టాక్ యాప్ ని ఇండియాలో బ్యాన్ చేసినా, ప్రపంచవ్యాప్తంగా మాత్రం దీని క్రేజ్ తగ్గలేదు. వరల్డ్ వైడ్ ఈ యాప్ టాప్‌లో నిలిచింది. ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లో టిక్ టాక్ యాప్ టాప్ యాప్ కాగా, ఇక గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్రం రెండో స్థానంలో నిలిచింది.

3. ఇన్ స్టాగ్రామ్  : ఫోటో షేరింగ్ యాప్ ఇన్ స్టాగ్రామ్ గూగుల్ ప్లేస్టోర్, ఇంకా యాపిల్ యాప్ స్టోర్‌లో ఇంస్టాగ్రామ్ 3వ స్థానంలో నిలిచింది. దీనిలో  రీల్స్ ఫీచర్ రావడంతో బాగా ఫేమస్ అయ్యింది.

4. వాట్సాప్ : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో 4వ స్థానంలో నిలిచింది.

5. ఫేస్ బుక్ మెసెంజర్ :  ఫేస్‌బుక్‌కు చెందిన మెసేజింగ్ యాప్ మెసెంజర్ యాపిల్ యాప్ స్టోర్‌లో 7వ స్థానంలో నిలవగా, గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్రం 6వ స్థానంలో నిలిచింది.

6. స్నాప్‌చాట్ : స్నాప్‌చాట్ గూగుల్ ప్లేస్టోర్‌లో 7వ స్థానంలో నిలివగా యాపిల్ యాప్ స్టోర్‌లో మాత్రం కనీసం టాప్ 10 లో కూడా చోటు దక్కించుకో లేకపోయింది.


7. జూమ్ :  వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్. యాపిల్ యాప్ స్టోర్‌లో 5వ స్థానంలో నిలవగా , గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్రం ఇది 8వ స్థానంలో నిలిచింది.

8. గూగుల్ మీట్ : గూగుల్ మీట్ గూగుల్ ప్లేస్టోర్‌లో 9వ స్థానంలో నిలవగా యాపిల్ యాప్ స్టోర్‌లో టాప్ 10 లో చోటు దక్కించుకోలేకపోయింది.

9. యూట్యూబ్  : ఇక గూగుల్‌కు చెందిన వీడియో స్ట్రీమింగ్ యాప్ యాపిల్ యాప్ స్టోర్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఇంకా గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్రం టాప్ 10 లో చోటు దక్కలేదు.

10. జీమెయిల్ : గూగుల్ ఇమెయిల్ సర్వీస్ యాపిల్ యాప్ స్టోర్‌లో 10వ స్థానంలో నిలివగా గూగుల్ ప్లే స్టోర్‌లో టాప్ 10 లో చోటు దక్కించుకోలేకపోయింది.

Post a Comment

0 Comments

Close Menu