ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు : అరుంధతి రెడ్డి, సాహిబ్జాదా ఫర్హాన్


అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఫిబ్రవరి నెలకు గాను 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు విజేతలను సోమవారం ప్రకటించింది. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసినం భారత ఆల్-రౌండర్ అరుంధతి రెడ్డి మహిళల విభాగంలో ఈ పురస్కారాన్ని దక్కించుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో గెలుపొందడంలో అరుంధతి రెడ్డి కీలక పాత్ర పోషించింది. అధ్బుత బౌలింగ్ తో రాణించిన అరుంధతి.. మూడు మ్యాచ్‌లలో ఎనిమిది వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. పురుషుల విభాగంలో 2026 టీ20 ప్రపంచ కప్‌లో తన ప్రదర్శనకు గాను పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు గెలుచుకున్నాడు. సాహిబ్జాదా ఫర్హాన్ టి20 ప్రపంచ కప్ 2026లో అద్భుత ప్రదర్శన చేసి, రెండు శతకాలతో 383 పరుగులు సాధించాడు. ఒకే టీ20 ప్రపంచ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా, ఒక టీ20 ప్రపంచ కప్‌ చరిత్రలో రెండు శతకాలు సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org