Ad Code

ఇంటర్నెట్‌ పాస్‌వర్డ్‌ భద్రపరుచుకోండి

https://encrypted-tbn0.gstatic.com/images?q=tbn:ANd9GcSSy-Z17Qio8AsgNnHSgXzwTmpYJgcwmcN9gqWESAXTgSbJE9qcనారాయణ ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగి. దూరప్రాంత ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. తన భార్య పుట్టిన రోజు సందర్భంగా బహుమతి పంపిద్దామనుకున్నాడు. ఊర్లోని మిత్రుల ద్వారా పంపిస్తే బావుండదని, తను ఇంటర్నెట్‌ ద్వారా ఆర్డర్‌ ఇస్తే ఇంటికి వెళుతుంది కదా అని నెట్‌ ద్వారా ఆర్డర్‌ ఇచ్చాడు. తర్వాత రోజు భార్య నుంచి ఫోన్‌ వస్తుందనుకుంటే రాలేదు. తనే ఫోన్‌ చేసి ఏమిటి శ్రీమతిగారు! పంపిన బహుమతి బాగోలేదని అలిగారా? అని అడిగాడు. బహుమతి ఏమిటండీ! మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావటం లేదు అందామె. క్షణకాలం మతిపోయినంత పనయింది నారాయణకు. వెంటనే ల్యాప్‌టాప్‌ ఓపెన్‌ చేసి నెట్‌లో బ్యాంక్‌సైట్‌లోకి వెళ్లి చూస్తే అక్షరాల లక్ష రూపాయల వరకు క్రెడిట్‌ వాడినట్లు ఉంది. గుండె గుభేల్‌ మంది.
వెంటనే బ్యాంక్‌ కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసి తన యూజర్‌ ఐడి, పాస్‌వర్డ్‌ దుర్వినియోగమైనట్లు తెలిపాడు. వారు ఇచ్చిన కస్టమర్‌కేర్‌ నెంబర్‌ను నోట్‌ చేసుకున్నాడు. దాని ఆధారంగా పోలీస్‌ కంప్లయింట్‌ ఇచ్చాడు. పోలీసులు దర్యాప్తు చేయగా అది తప్పుడు వెబ్‌సైట్‌గా తెలిసింది. బ్యాంక్‌వాళ్లు సైతం దీనిపై తగు జాగ్రత్తలో ఉండాల్సిందిగా గతంలోనే సూచించాం కదా.. అంటూ చేతులు దులిపేసుకున్నారు. అరే.. ఎంత పని జరిగింది అని తెల్సినవాళ్లు ఊరడించారు గానీ, ఎలాంటి చర్యలు చేపట్టలేదు. సరికదా పోగొట్టుకొన్న డబ్బును వెనక్కు ఎలా తీసుకోవచ్చో కూడా తెలపలేదు. మిత్రులు రకరకాలైన వ్యాఖ్యానాలు చేశారు. డబ్బు పోయిందన్న బాధతో ఉన్న నారాయణకు ఊరడింపుగా పోలీసుల నుంచి తీపికబురు వచ్చింది. మీ క్రెడిట్‌ కార్డు ద్వారా డబ్బును వినియోగించిన ఘరానా మోసగాడు దొరికాడని.
తర్వాత కొద్ది రోజులకు తన చిన్ననాటి మిత్రుడు పవన్‌ను కలిశాడు. తనకు జరిగిన అనుభవాన్ని తనకు చెప్పాడు. పవన్‌ ఒక ప్రయివేట్‌ బ్యాంక్‌లో మేనేజర్‌. సరే..జరిగిందేదో జరిగిపోయిందంటూ ... ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ఎలా చేయాలో సూచనలు ఇచ్చాడు. అందులో ప్రధానంగా ఇంటర్నెట్‌లో జరిగే మోసాలను ఫిషింగ్‌ అంటారు. దాని బారిన పడకుండా ఉండాలంటే.. బ్యాంకులు సూచించిన విధంగానే కాకుండా మీరు సైతం చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మోసపోకుండా ఉండవచ్చని తెలియజేశాడు. అవేమిటంటే..
పాస్‌వర్డ్‌, యూజర్‌ ఐడిని అడుగుతూ మీ మెయిల్స్‌కు వచ్చే అవాంఛిత మెయిల్స్‌కు మీ పాస్‌వర్డ్స్‌, యూజర్‌ ఐడిలను ఇవ్వొద్దు.
తప్పుడు యుఆర్‌ఎల్‌ అడ్రస్‌ ఇస్తూ మీ ఇ-మెయిల్‌కు వచ్చే వెబ్‌సైట్‌ లింక్‌లను ఓపెన్‌ చేయవద్దు.
మీ సన్నిహితులకు సైతం మీ క్రెడిట్‌కార్డు, పిన్‌ నెంబర్‌లను తెలపవద్దు.
ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేటప్పుడు క్రెడిట్‌కార్డు వివరాలు ఒకటికి రెండు సార్లు చెక్‌చేసుకొని ఇవ్వండి. మీరు ఎంటర్‌ అయింది సరైన సైట్‌ అవునో, కాదో ముందుగానే నిర్థారించుకోండి.
ఇంటర్నెట్‌ పాస్‌వర్డ్‌ భద్రపరుచుకోండి.
సైబర్‌కేఫ్‌ల నుంచి, భద్రత లేనటువంటి కంప్యూటర్స్‌ నుంచి ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ చేయవద్దు.
ఇంటర్నెట్‌ నుంచి లాగాఫ్‌ కాకుండా వెళ్లకండి. ఇతరులు ఎవరైనా ఎంటర్‌ అయి మీ ఇంటర్నెట్‌ అకౌంట్‌ సాయంతో కొనుగోళ్లు చేయవచ్చు.
మీకు తెలియ కుండా మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్‌ అయ్యే స్పామ్‌ పోగ్రామ్‌ల పట్ల కాసింత జాగ్రత్తగా వ్యవహ రించండి.
అతి తెలివి మోసాలు..
ఆధునిక ప్రపంచంలో ఇంటర్నెట్‌ కొత్త శకాన్ని ఆవిష్కరించింది. దీనివల్ల బహుళ ప్రయోజనాలు అదేస్థాయిలో అనర్థాలూ జరుగుతున్నాయి. ప్రత్యేకించి ఈ ఇంటర్నెట్‌ వల్ల ఇ-కామర్స్‌ బాగా వేగంగా అభివృద్ధి చెందింది. అయితే ఇంటర్నెట్‌ ఆధారంగా చేసుకొని మోసాలు చేసేవారి సంఖ్య ఇటీవల కాలంలో భారత్‌లో భారీగా పెరిగింది. దీన్నే 'ఫిషింగ్‌' అని వ్యవహరిస్తారు. ఈ ఫిషింగ్‌ మోసం మరింతగా రాటుదేలి 'విషింగ్‌' అనే కొత్త రూపం సంతరించుకొంది. అధికారికమైన ఇ-మెయిల్స్‌ అనిపించే విధంగా డూప్లికేట్‌ ఇ-మెయిల్స్‌ను వినియోగ దారులకు పంపించి, వారి బ్యాంకు ఖాతాలను, వారి క్రెడిట్‌ కార్డులను (అప్‌గ్రేడేషన్‌ను) నవీనీకరించుకొమ్మని కోరుతూ మెయిల్‌ వస్తుంది. ఎస్‌బి (సేవింగ్‌ బ్యాంక్‌) అకౌంట్‌, పుట్టిన రోజు, పిన్‌ నెంబర్‌, యూజర్‌ ఐడి, పాస్‌వర్డ్‌ వంటి కీలకమైన సమాచారాన్ని ఇవ్వాలని అడిగి... ఖాతాలోని సొమ్మును ఖాళీ చేసేయటం ఈ ఫిషింగ్‌ విధానంలో ప్రత్యేకత. ఈతరహా ద్రోహానికే ఫోన్‌ వినియోగించుకుంటే దాన్ని విషింగ్‌గా వ్యవహరిస్తారు.
మీ బ్యాంక్‌ అకౌంట్‌లో అనధికారిక లావాదేవీలు ఏర్పడినట్లు మాకు కంప్లయింట్‌ వచ్చింది. దయచేసి దీనికి సంబంధించిన సమాచారాన్ని మాకు తెలియచేయండి అంటూ తియ్యటి గొంతుతో ఫోన్‌లో మిమ్మల్ల్ని ఫ్లాట్‌ చేస్తారు.
ఇలా చేయటానికి మీకు ఇ-మెయిల్‌, ఎస్‌ఎమ్‌ఎస్‌, ఫోన్‌కాల్‌ మాధ్యమాల ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తారు. లేకపోతే మీరు ఫలానా నెంబర్‌ను కాంట్రాక్ట్‌ అయితే మీకు దానికి సంబంధించిన మరింత సమాచారం మా కస్టమర్‌కేర్‌ ఎగ్జిక్యూటివ్‌ అందిస్తారు అని సమాచారం ఉంటుంది. మీరు మీ అకౌంట్‌ నెంబర్‌, పిన్‌ నెంబర్‌ను చెప్పాలని కస్టమర్‌కేర్‌ ఎగ్జిక్యూటివ్‌ మాటల గారడీతో మిమ్మల్ని బురడీ కొట్టించటం ద్వారా మీ వ్యక్తిగత వివరాలు సేకరించవచ్చు. మీరు బ్యాంక్‌ కస్టమర్‌కేర్‌ను సంప్రదించ కుండానే మీ వ్యక్తిగత వివరాలను ముక్కూ ముఖం తెలియని వ్యక్తికి తెలియజేయటం ద్వారా మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోతుంది.
ఇలా మీ వ్యక్తిగత వివరాలు సేకరించటంలో చాలా నైపుణ్యంగా వ్యవహరిస్తారు. దీనికోసం వాయిస్‌ మెసేజింగ్‌ ద్వారా మోసగాళ్లు ఎదుటి వారిని బురిడీ కొట్టిస్తారు. మీరు చెప్పే జవాబులను ఆటోమ్యాటిక్‌గా రికార్డింగ్‌ చేయటం ద్వారా వినియోగదారులకు సంబంధించిన సమస్త సమాచారాన్ని మోసగాళ్లకు చేర్చుతుంది. ఈ విషింగ్‌ విధానం ద్వారా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మోసాలు గణనీయంగా పెరుగుతున్నాయి. భవిష్యత్‌లో దీనికి మరింతగా ఆధునీకరించి మన దగ్గరా ఇటువంటి మోసాలు జరిగే అవకాశాలున్నాయి. అదిగో బూచి అంటే ఇదిగో ఇక్కడ అనే విధంగా వ్యవహరించటం వల్లే మోసగాళ్ల ఆటలు సాగుతున్నాయి అని ఇంటర్నెట్‌ భద్రతా నిపుణులు అంటున్నారు.
మొబైల్‌తో నగదు బదిలీ!
ఇదంతా ఒక ఎత్తయితే త్వరలో ఫోన్‌ ద్వారానే మనియార్డర్లు సైతం పంపుకొనే సదుపాయం సైతం త్వరలో భారతీయ మొబైల్‌ వినియోగ దారులకు అందుబాటులోకి రానున్నది. ఈ వ్యవస్థను ప్రముఖ టెలికమ్యూనికేషన్స్‌ సంస్థ రిలయన్స్‌ మొబైల్‌ త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే మొబైల్‌ బ్యాంకింగ్‌ అందిస్తున్న సంస్థలు ఎక్కువగా జిఎస్‌ఎమ్‌ హ్యాండ్‌సెట్స్‌ విభాగంలో ఉన్నాయి. ఈ సౌకర్యం ఉన్నటువంటి వినియోగదారులు తమ హ్యాండ్‌సెట్స్‌లో మొబైల్‌ వ్యాలెట్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ఎవరికైనా డబ్బులు పంపాలన్నా, చెల్లింపులు చేయాలన్నా వారి పేరుతో మనియార్డర్‌, డిమాండ్‌ డ్రాఫ్ట్‌లను పంపుతున్నాము. కానీ మారిన కాలానుగుణంగా బ్యాంకింగ్‌ లావాదేవీల్లోనూ విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఆన్‌లైన్‌తో అనుసంధానమైన ఒకే బ్యాంక్‌ నెట్‌వర్క్‌లో అయితే మీరు అదనంగా ఎటువంటి నగదు చెల్లించనవసరం లేదు. అదే బ్యాంక్‌లో అవతల ఖాతాదారుడి అకౌంట్‌ నెంబర్‌, పేరు వివరాలు ఉండి, మీరు ఎంత నగదు మీరు చెల్లించదలచుకున్నారో నిర్ణయించుకొంటే ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌(ఈఎఫ్‌టి) విధానం ద్వారా ఆన్‌లైన్‌ చెల్లింపులు జరిగి క్షణాల్లో నగదును పంపవచ్చు. అయితే ఈ విధానాన్ని వినియోగించేటప్పుడు ఏమాత్రం అశ్రద్ధ చేసినా, బ్యాంక్‌ ఎకౌంట్‌ మొత్తం గల్లంతు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
తెల్సుకునేది ఇలా...
మీరు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ నిర్వహిస్తున్నట్లయితే ప్రధానమైన రెండు సూచనల ద్వారా మీరు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ చక్కగా చేసుకోవచ్చు.
మీ బ్యాంక్‌ వెబ్‌సైట్‌ను పోలిన డమ్మీ వెబ్‌సైట్స్‌ ఒక్కోసారి వస్తే వాటిలో మీ ఎకౌంట్‌ వివరాలు ఎంటర్‌ చేయవద్దు. మీ బ్యాంక్‌ ఎకౌంట్‌కు సంబంధించిన సమాచారం కేవలం బ్యాంక్‌ కస్టమర్‌ కేర్‌ను అడిగి తెల్సుకోండి.
బ్యాంక్‌ యుఆర్‌ఎల్‌ ముందు నీశిశిచీ వద్ద నీశిశిచీరీ అనేది ఉంటే (ఇక్కడ 'రీ'అంటే భద్రం) మీ బ్యాంక్‌ వెబ్‌సైట్‌ను ఎక్కడ నుంచైనా యాక్సెస్‌ చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu