Ad Code

మహారాష్ట్రలో ధర లేక టమోటాలను రోడ్డుపై పారబోసిన రైతు !

హారాష్ట్రలో రైతు మైనుద్దీన్ షేక్ రోడ్డుపై టమోటాలు పారబోసిన ఘటన తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. అప్పులు తెచ్చి, ట్యాంకర్ నీటితో ఎంతో కష్టపడి పండించిన పంట మార్కెట్లో ధర లేకపోవడంతో బరువెక్కిన గుండెతో కన్నీరు మున్నీరయ్యాడు. మార్కెట్లో ట్రే ధర కేవలం వంద రూపాయలు మాత్రమే  పలకడంతో కూలీలకు ఇచ్చే డబ్బులు కూడా చేతికి అందలేదు. రవాణా ఖర్చులు భరించే శక్తి లేక రైతన్న పండించిన పంటను రోడ్డుపై పారబోసే దయనీయ పరిస్థితి తలెత్తింది. వ్యవసాయానికి పెట్టిన ఖర్చు పూర్తిగా నష్టపోవడంతో కుటుంబం ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. అన్నదాతలకు కష్టకాలం ఎదురైనప్పుడు ఆదుకునే వ్యవస్థ లేకపోవడం శోచనీయం. రేయింబవళ్లు కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర దక్కకపోవడం రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. ఈ ఘటన వ్యవసాయ రంగంలోని దయనీయ పరిస్థితులను మరియు రైతుల కన్నీటి గాθలను కళ్లకు కడుతోంది.

Post a Comment

0 Comments

Close Menu