Ad Code

గణనీయమైన వృద్ధిని సాధిస్తున్న భారత ఈ-కామర్స్ రంగం : ఇన్ఫిసమ్ నివేదిక

ర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, క్విక్ కామర్స్ సూపర్ ఫాస్ట్ డెలివరీల కారణంగా భారత ఈ-కామర్స్ రంగం గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. ప్రముఖ పరిశోధన కన్సల్టెన్సీ సంస్థ 'ఇన్ఫిసమ్' తాజా నివేదిక ప్రకారం, 2024లో 125 బిలియన్ డాలర్లు (రూ. 11.85 లక్షల కోట్లు)గా ఉన్న భారత ఈ-కామర్స్ మార్కెట్, 18.4 శాతం వార్షిక వృద్ధి రేటుతో 2030 నాటికి దాదాపు మూడు రెట్లు పెరిగి 345 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 33 లక్షల కోట్లు) చేరుకోనుంది. వేగవంతమైన డెలివరీలకు దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకునేందుకు ప్రస్తుతం ఉన్న డార్క్ స్టోర్ల సంఖ్య 2,525 నుండి 2030 నాటికి 7,500కి చేరనుండటం ఈ రంగంలో రాబోయే విప్లవాత్మక మార్పుకు అద్దం పడుతోంది. ప్రస్తుతం ఈ రంగంలో 44 శాతం మార్కెట్ వాటాతో బ్లింకిట్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత జెప్టో (25 శాతం), స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ (20 శాతం) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఇందుకు ప్రధానంగా 'జెన్-జీ' యువత ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారని, కొత్తగా వస్తున్న డైరెక్ట్-టు-కన్స్యూమర్ (డీ2సీ) ఆర్డర్లలో ఏకంగా 66 శాతం మెట్రోపాలిటన్ నగరాలను దాటి టైర్-2, టైర్-3 పట్టణాల నుంచే వస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. ఈ దశాబ్దం పూర్తయ్యే నాటికి భారత రిటైల్ రంగానికి ఈ-కామర్స్ 2.5 శాతం జీడీపీ కాంట్రిబ్యూషన్‌తో సేవలు అందిస్తూ, దాదాపు 44 కోట్ల ఆన్‌లైన్ కొనుగోలుదారులను చేరుకుంటుంది. అదే సమయంలో, ఏఐ, మెషిన్ లెర్నింగ్ విధానాలు రిటైల్ రంగంలో ఉత్పాదకతను 35-37 శాతం మేర పెంచనున్నాయి. ఏఐ వర్చువల్ అసిస్టెంట్లు, చాట్‌బాట్‌లు, వర్చువల్ ట్రై-ఆన్ వంటి ఆధునిక ఫీచర్ల ద్వారా కస్టమర్లు డిజిటల్ ఉత్పత్తులను ఎంచుకునే తీరు మారిపోతుండటంతో, భారత రిటైల్ రంగ భవిష్యత్తు అత్యంత సానుకూలంగా ఉందని నివేదిక వెల్లడించింది.

Post a Comment

0 Comments

Close Menu