Ad Code

నల్లగొండలో ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలి : సీఐటీయూ

తెలంగాణలోని నల్లగొండ జిల్లా కేంద్రంలో వెంటనే ఈఎస్‌ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని, ఎన్నికల మేనిఫెస్టోలో కార్మికులకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి తన నకిరేకల్ సభలో స్పష్టం చేయాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తుమ్మల వీరారెడ్డి, ఎండీ సలీం డిమాండ్ చేశారు. శుక్రవారం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జరిగిన ఆఫీస్ బేరర్స్ సమావేశంలో మాట్లాడుతూ  అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు 18,000, వీవోఏ, మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 వేతనం అందించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ, మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేస్తూ కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి ప్రతినెలా 1వ తేదీనే జీతాలు చెల్లించాలని కోరారు.

Post a Comment

0 Comments

Close Menu