సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బచత్ డేస్' సేల్ ను ప్రకటించింది. దీనిలో స్మార్ట్‌ఫోన్లను అత్యంత తక్కువ ధరకే దక్కించుకోవచ్చు. ప్రాడక్ట్ పేజీలోని కూపన్లను క్లిక్ చేయడం, అర్హత ఉన్న పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ జోడించడం, చెకౌట్ సమయంలో బ్యాంక్ ఇన్స్టంట్ డిస్కౌంట్లు అప్లై చేయడం ద్వారా బెస్ట్ ప్రైస్ పొందవచ్చు. రూ.10,000 లోపు బడ్జెట్‌లో 5G సపోర్ట్, మంచి బ్యాటరీ లైఫ్ కోసం రెడ్‌మి 13C 5G లేదా మోటో G24 పవర్‌ను ఎంచుకోవచ్చు. రూ.12,000 నుంచి రూ.15,000 బడ్జెట్‌లో సామ్‌సంగ్ గెలాక్సీ F15 5G, రియల్‌మి P1 5G ఫోన్లు సూపర్ AMOLED డిస్‌ప్లే, రెగ్యులర్ అప్‌డేట్స్‌తో బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తాయి. ఇక రూ.20,000 నుంచి రూ.25,000 విభాగంలో ఐకూ Z9 5G, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్లు అద్భుతమైన కెమెరా, పర్ఫార్మెన్స్ అందిస్తాయి. రూ.30,000 నుంచి రూ.40,000 శ్రేణిలో ఐకూ నియో 9 ప్రో లేదా పిక్సెల్ 8 ఫోన్లకు కూపన్ ప్లస్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లు బాగా సెట్ అవుతాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ చివరి వారంలో వచ్చే అవకాశం ఉంది. ఐఫోన్లు, ఫ్లాగ్‌షిప్ మోడళ్లపై అప్పుడే భారీ ఆఫర్లు, బంపర్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, గిఫ్ట్ కార్డులు లభిస్తుంటాయి. కాబట్టి మీరు ప్రీమియం లేదా హై-ఎండ్ ఫోన్ కొనాలనుకుంటే బిగ్ బిలియన్ డేస్ వరకు ఆగడం మంచిది. అదే బడ్జెట్ లేదా మిడ్-రేంజ్ ఆండ్రాయిడ్ ఫోన్లు కావాలనుకుంటే, బిగ్ బచత్ డేస్‌లోనే ఆఫర్లన్నీ కలిపి బెస్ట్ ధరకు దక్కించుకోవచ్చు.
0 Comments