ఫిలిప్స్ S7221 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల

ఫిలిప్స్ S7221 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గతంలో వచ్చిన S7220 5Gకి కొనసాగింపుగా వచ్చిన ఈ కొత్త ఫోన్‌లో ప్రీమియం డిజైన్‌తో పాటు అప్‌గ్రేడ్ స్పెసిఫికేషన్లను అందించారు. ముఖ్యంగా 64MP కెమెరా, కొత్త 5G ప్రాసెసర్, పెద్ద డిస్‌ప్లే, 5,700mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీనిలో 6.67 అంగుళాల IPS LCD డిస్‌ప్లేను అందించారు. ఇది HD+ రిజల్యూషన్‌తో వస్తుంది. అయితే రిఫ్రెష్ రేట్ 60Hzకే పరిమితం చేశారు. ఫోన్ ముందు భాగంలో పెద్ద డిస్‌ప్లే ఉండగా.. వెనుక భాగంలో స్క్వేర్ ఆకారంలోని కెమెరా మాడ్యూల్‌ను అందించారు. గత మోడల్‌తో పోలిస్తే కొత్త S7221 5Gకు మరింత ప్రీమియం ఫినిష్ ఇచ్చారు. వెనుక భాగంలో ప్రధాన కెమెరాతో పాటు మరో సహాయక లెన్స్‌ను స్క్వేర్ మాడ్యూల్‌లో అమర్చారు. ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 64MP ఆటోఫోకస్ కెమెరాను అందించారు. ఈ కెమెరాకు f/1.179 అపెర్చర్ ఉన్నట్లు సమాచారం. కెమెరా మాడ్యూల్‌లో ప్రత్యేకమైన వృత్తాకార ఫ్లాష్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్‌కు Unisoc T8200 ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్ పవర్ అందిస్తుంది. TSMC 6nm ప్రాసెస్‌పై రూపొందిన ఈ చిప్‌సెట్ బడ్జెట్ విభాగంలో మంచి పనితీరును అందించేలా రూపొందించారు. N1, N3, N28, N41, N77, N78 వంటి పలు 5G బ్యాండ్లకు ఇది సపోర్ట్ చేస్తుంది. బెంచ్‌మార్క్ వివరాల ప్రకారం Unisoc T8200 AnTuTu 11లో సుమారు 7,57,199 పాయింట్లను సాధించినట్లు సమాచారం. Geekbench 6లో సింగిల్-కోర్ టెస్ట్‌లో 885 పాయింట్లు, మల్టీ-కోర్‌లో 2,392 పాయింట్లు, GPU టెస్ట్‌లో 2,236 పాయింట్లు సాధించినట్లు తెలుస్తోంది. దీనిలో 5,700mAh బ్యాటరీను అందించారు. దీనికి 9V/2A స్టాండర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే USB Type-C పోర్ట్ అందించారు. అయితే ప్రత్యేకమైన 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఇందులో లేదు. Philips S7221 5G మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. సిల్వర్/టైటానియం గ్రే, డార్క్ బ్లూ/నేవీ, బ్లాక్ కలర్ వేరియంట్లు ఉన్నాయి.


Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains