హైదరాబాద్ లోని కుషాయిగూడ నందిని మిల్క్ సెంటర్లో అక్రమంగా కల్తీ పెరుగు, కల్తీ కోవా తయారీ సెంటర్ పై మల్కాజిగిరి ఎస్.ఓ.టీ పోలీసులు దాడి చేశారు. టాటా ఏసీ లో సుమారు 120 కిలోల కల్తీ పెరుగు, 6 కిలోల కోవాను తరలిస్తున్న రామచందర్ అనే వ్యక్తిని జవహర్ నగర్ లో అదుపులోకి తీసుకుని టాటా ఏస్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ ను ఎక్కడినుండి తెస్తున్నావని వివరాలు అడగగా కుషాయిగూడ లోని నందిని మిల్క్ సెంటర్ల నుండి తీసుకొస్తున్నామని చెప్పడంతో కుషాయిగూడ లోని పాల సెంటర్ పై ఎస్ఓటి పోలీసులు దాడి పాల సెంటర్లో పాలకోవా, పెరుగును తయారు చేస్తూ మ్యానుఫ్యాక్చర్ డేటు, ఎక్స్పైరీ డేటుతో పాటు, ఎలాంటి లేబల్ వేయకుండా చాలా కాలంగా అక్రమంగా తయారు చేస్తున్నారని కల్తీ వస్తువులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని, టాటా ఏసీ వాహనాలను సీజ్ చేశారు ఎస్ఓటి పోలీసులు. నందిని మిల్క్ పార్లర్ ఓనర్ చంద్రశేఖర్ పై జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీసులు పెరుగు, కోవా శాంపిల్ లను ఫుడ్ సేప్టీ ఇన్స్పెక్టర్ కు పంపించి పూర్తి ఆధారాలు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు నందిని మిల్క్ పార్లర్ లో తనిఖీలు నిర్వహించగా దాదాపు 1000 కిలోల పెరుగు, 50 కిలోల కోవా నిలువ ఉంచినట్లు ఎస్.వట్టి పోలీసులు తెలిపారు.
0 Comments