Ad Code

కోరుట్లలో మైనర్ బాలికపై అత్యాచారం

తెలంగాణ లోని జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివారులోని నక్కలగుట్ట ప్రాంతంలో మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అదే ప్రాంతానికి చెందిన వెంకట్రావు అనే వ్యక్తి బాలికను ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. బాలిక పట్టణంలోని ఓ షాపింగ్ మాల్‌లో  పనిచేస్తోంది. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా వెంకట్రావు ద్విచక్ర వాహనంపై ఆమె వద్దకు వచ్చి, తాను కూడా ఇంటికే వెళ్తున్నానని, వాహనంపై ఇంటి వద్ద దింపుతానని చెప్పినట్లు స్థానికులు తెలిపారు. దీంతో బాలిక అతడి వాహనంపై ఎక్కినట్లు సమాచారం. అనంతరం ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతానికి బాలికను తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు వారు పేర్కొన్నారు. ఘటనపై సమాచారం అందడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. బాలిక నుంచి వివరాలు సేకరించడంతో పాటు ఘటనకు సంబంధించిన ఆధారాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మైనర్ బాలిక కావడంతో ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. 

Post a Comment

0 Comments

Close Menu