Ad Code

బంగారానికి మరింత డిమాండ్ పెరిగే అవకాశం : అదే తోవలో వెండి, రాగి : రాబర్ట్ కియోసాకి అంచనా

బంగారానికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి అంచనా వేశారు. పెట్టుబడిదారులు కాకుండా అమెరికా డాలర్లను పెద్ద మొత్తంలో కలిగి ఉన్న సెంట్రల్ బ్యాంకులు కూడా భారీగా పసిడిని కొనుగోలు చేస్తున్నట్ట్లు తెలిపారు. ప్రపంచ దేశాలు అమెరికా డాలర్లకు బదులుగా బంగారాన్ని నిల్వ చేసుకునే విధానం పెరిగిందని, ఇది గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని కియోసాకి పేర్కొన్నారు. 1971 ఆగస్టు 15న అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ డాలర్‌ను బంగారంతో మార్పిడి చేసే విధానాన్ని నిలిపివేస్తున్నట్లు రాబర్ట్ కియోసాకి గుర్తు చేశారు. అప్పట్లో ఇది తాత్కాలిక నిర్ణయమని చెప్పినప్పటికీ 54 ఏళ్లుగా అది కొనసాగుతోందని వివరించారు. అంతకుముందు డాలర్‌ విలువకు బంగారం ఆధారం ఉండేదని, ఆ తర్వాత అది ప్రభుత్వంపై, దాని విశ్వసనీయతపై ఆధారపడే కరెన్సీగా మారిందని తెలిపారు. అమెరికా అప్పులు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు తమ డాలర్‌ నిల్వలను బంగారంగా మార్చుకునే విధానం పెరుగిపోతుందని అంచనా వేశారు. బంగారం ధర $10,000, వెండి ధర $200కి చేరుకుంటుందని తనకు తెలిసిన నిపుణులు అంచనా వేశారని రాబర్ట్ కియోసాకి ఇప్పటికే ప్రకటించారు. తాను ప్రస్తుతం బంగారం కంటే వెండికే ప్రాధాన్యత ఇస్తున్నానని తెలిపారు. అమెరికా ద్రవ్యోల్బణం, ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు లేదా తగ్గదుల నిర్ణయాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆగస్టులో అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాలకు అనుగుణంగా ఉన్నాయని గుర్తు చేశారు. దీంతో సెప్టెంబరులో రేట్ల పెంపు అవకాశాలు ఉండవన్న అంచనాలతో బంగారం ధర 4,400 డాలర్లకు చేరినట్లు అంచనా వేశారు. భవిష్యత్తులో వెండికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. వెండి కేవలం పెట్టుబడి లోహం మాత్రమే కాదన్నారు. సౌర విద్యుత్, ఎలక్ట్రానిక్స్, ఇతర పారిశ్రామిక రంగాల్లో కూడా వెండిని ఉపయోగిస్తున్నారని గుర్తు చేశారు. దీంతో భవిష్యత్తులో పారిశ్రామిక డిమాండ్ పెరిగితే వెండికి అదనపు మద్దతు లభించవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. అలాగే రాగి ధర కూడా పెరిగే అవకాశం ఉందని రాబర్ట్ కియోసాకి అంచనా వేశారు. అందుకే వెండి, బంగారం, రాగిలో పెట్టబడి పెడితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. బంగారం, వెండి తర్వాత పెట్టుబడిదారులకు అత్యంత ఇష్టమైన వస్తువుగా రాగి మారిందన్నారు. మౌలిక సదుపాయాలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో రాగి వాడకం పెరుగుతోందని వివరించారు. దీంతో రాగికి డిమాండ్ ఏర్పడిందని వివరించారు. రాగి తయారు చేసే కంపెనీలు గత సంవత్సర కాలంగా మంచి లాభాలను అందిస్తున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తు లో కూడా రాగి ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. అలాగే రాగి ధర కూడా పెరిగే అవకాశం ఉందని... అందుకే వెండి, బంగారం, రాగిలో పెట్టబడి పెడితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.

Post a Comment

0 Comments

Close Menu