పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించారంటూ సయీద్ ఖాన్ అనే ఆ దేశ జర్నలిస్ట్ సంచలన పోస్ట్ పెట్టారు. ఇమ్రాన్ జైల్లో మృతి చెందినట్లు ముగ్గురు సీనియర్ సైనికాధికారులు చెప్పారని పేర్కొన్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై పాక్ ప్రజలు, పార్టీ కార్య కర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఇమ్రాన్‌ఖాన్‌ను కలిసేందుకు ఆయన కుటుంబసభ్యులకు అనుమతిని నిరాకరించడంతో ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ నేతకు ఏదైనా జరిగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి రావడానికి 20 లక్షల మంది సిద్ధంగా ఉన్నారని ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి, తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ నేత సోహైల్ అఫ్రిది పేర్కొన్నారు. అప్పుడు యువత ఆగ్రహాన్ని కట్టడి చేయడానికి మొత్తం సైన్యం కూడా సరిపోదన్నారు. ఇమ్రాన్‌ను కలవడానికి ఆయన కుటుంబసభ్యులకు, వైద్యులకు ప్రవేశం నిరాకరిస్తే నిరసనలు చేపడతామని పిటిఐ హెచ్చరించింది. సెప్టెంబర్ 27న ఇస్లామాబాద్ వైపు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే ఈ విషయంపై పాకిస్తాన్ ప్రభుత్వం కానీ, జైలు అధికారులు కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు.
0 Comments