Ad Code

మమతా బెనర్జీ కారుపై ఇటుకలు, రాళ్లతో దాడి చేసిన దుండగులు

శ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వాహనంపై ఉత్తర 24 పరగణాల జిల్లాలో దాడి జరిగింది. పోలీస్ కస్టడీలో మరణించిన పార్టీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు హాలిసహార్ వెళ్తుండగా కొందరు అజ్ఞాత వ్యక్తులు ఆమె కాన్వాయ్‌ను చుట్టుముట్టి ఇటుకలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారని, వాహనంపై బురద చల్లి, నీళ్ల సీసాలు, చెప్పులు విసిరారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అద్దాలు మూసి ఉండటం వల్లే ప్రాణాపాయం తప్పిందని, లేకపోతే తన తల పగిలి ప్రాణాలు పోయేవని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తమకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని, వారు కేవలం బీజేపీకే రక్షణ కల్పిస్తున్నారని విమర్శించారు. ఘటన సమయంలో స్థానికంగా "చోర్ భగావో" అంటూ నినాదాలు హోరెత్తాయి. టీఎంసీ లోక్‌సభ ఎంపీ కల్యాణ్ బెనర్జీ, రాజ్యసభ ఎంపీ డోలా సేన్‌లు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.

Post a Comment

0 Comments

Close Menu