Ad Code

భారీ వర్షానికి నీట మునిగిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు : వీడియోలు సోషల్ మీడియాలో వైరల్

నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీ వర్షానికి టెర్మినల్‌-పార్కింగ్ మార్గంలో నీరు నిలిచిపోయింది. రూ.11,200 కోట్లతో నిర్మించిన ఎయిర్‌పోర్టు ప్రారంభించి ఐదు నెలలు కూడా పూర్తికాకముందే నీట మునిగింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. దీంతో 'అభివృద్ధి మోడల్'గా ప్రచారం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఇది ఊహించని ఎదురుదెబ్బగా మారింది. మంగళవారం గ్రేటర్ నోయిడాలో భారీ వర్షం కురిసింది. వర్షం దెబ్బకు జేవర్‌లోని నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో టెర్మినల్‌ నుంచి పార్కింగ్ ప్రాంతానికి వెళ్లే మార్గం నీటితో నిండిపోయింది. ప్రయాణికులు, వాహనాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీటిని తొలగించేందుకు ఎయిర్‌పోర్టు సిబ్బంది రంగంలోకి దిగిన దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ కావడంతో రాజకీయ దుమారం మొదలైంది. భారీ పెట్టుబడులు, ఆధునిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన విమానాశ్రయంగా ప్రచారం పొందిన ప్రాజెక్టులో.. ఒక్క భారీ వర్షం పడితే నీరు నిలిచిపోవడమేంటి? అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధించారు.

Post a Comment

0 Comments

Close Menu