Ad Code

తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డు మోడల్‌ విడుదల

తెలంగాణలో ఈ నెల 15 నుంచి 15 రోజుల పాటు కొత్త 'స్మార్ట్ రేషన్ కార్డుల'ను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ నేపథ్యంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డు మోడల్‌ను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. అత్యంత ఆధునికమైన డిజైన్‌తో రూపొందించిన ఈ స్మార్ట్ రేషన్ కార్డులో భద్రత, స్పష్టతకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చారు. కార్డు ముందు భాగంలో సీఎం రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు ఉన్నాయి. వాటితో పాటు రేషన్ కార్డు నంబర్, కుటుంబ యజమాని పేరు, సంబంధిత రేషన్ షాపు నంబర్ వంటి కీలక వివరాలు ముద్రించి ఉన్నాయి. ఇక వెనుక భాగంలో కార్డు దుర్వినియోగం కాకుండా ఉండటానికి ప్రత్యేకమైన హోలోగ్రామ్, తక్షణ సమాచారం కోసం క్యూఆర్ కోడ్ (QR Code) ఏర్పాటు చేశారు. అదేవిధంగా లబ్ధిదారుడి గ్రామం, ప్రాంతం, మండలం, జిల్లా, పూర్తి చిరునామా వివరాలను పొందుపరిచారు. ఈ స్మార్ట్ కార్డుల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu