Ad Code

ఇంట్లోకి చొరబడి వ్యక్తిపై కత్తులతో దాడి చేసిన దుండగులు : పరిస్థితి విషమం

తెలంగాణ లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల కేంద్రంలో ఓ వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో గౌరారపు నరసింహారావు తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు ఆయనపై కత్తులతో దాడికి పాల్పడినట్లు సమాచారం. కత్తులతో దాడి చేయడంతో నరసింహారావు భుజంతో పాటు శరీరంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం దుండగులు ఆయనను ద్విచక్రవాహనంపై తీసుకెళ్లి దుమ్ముగూడెంలోని ఓ ప్రాంతంలో వదిలేసి పరారైనట్లు తెలిసింది. తీవ్ర రక్తస్రావంతో ఉన్న నరసింహారావును స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని దుమ్ముగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తరలించినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Post a Comment

0 Comments

Close Menu