Ad Code

కావేరీ జలాల ఆందోళన కార్యక్రమం : వివాదాస్పదమైన ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు

తంజావూరులో కావేరీ జలాల విషయంలో ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ డీఎంకే ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ పాల్గొని ప్రసంగిస్తున్న  సమయంలో ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న నిరసనకారులు త్రిష, త్రిష అంటూ నినాదాలు చేశారు. దీంతో ఉదయనిధి స్టాలిన్ తన ప్రసంగాన్ని ఆపి ఓ నవ్వు నవ్వి నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా అక్కడికి చేరాలి అంటూ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత తాను కావేరీ జలాల గురించే మాట్లాడుతున్నానని వివరణ ఇచ్చినప్పటికీ, త్రిషను ఉద్దేశించే వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై టీవీకే నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయనిధిపై మహిళా కమిషన్‌ను ఫిర్యాదు కూడా చేశారు.  నిరసన ప్రదర్శనలో ఉదయనిధి మాట్లాడుతూ, విజయ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డెల్టా రైతుల ప్రయోజనాలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆయన ప్రసంగిస్తోన్న సమయంలో పలువురు కార్యకర్తలు త్రిష, త్రిష అంటూ నినాదాలు చేశారు. ఆ నినాదాల మధ్యనే తన ప్రసంగాన్ని కొనసాగించిన ఉదయనిధి పరోక్షంగా నటి ప్రస్తావన తెచ్చారు. ఆమె గురించి ద్వంద్వార్థం ధ్వనించేలా అనుచితంగా మాట్లాడారు. అయితే తాను చెప్పింది కావేరీ గురించేనని ఆయన వివరణ ఇచ్చారు. దీంతో ఉదయనిధి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 'ఇవి అసహ్యమైన వ్యాఖ్యలు. ఎవరిపైనా ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదు. డీఎంకే దిగజారుతున్న రాజకీయ ప్రమాణాలకు ఈ మాటలు నిదర్శనం' అని టీవీకే నేతలు మండిపడ్డారు. భాజపా నేతలు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. 

Post a Comment

0 Comments

Close Menu