Ad Code

పాఠశాలల అడ్మిషన్ ఫారమ్‌ల నుంచి కులంకాలమ్‌ తొలగించిన హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం

హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పులకు సరికొత్తగా  శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల అడ్మిషన్ ఫారమ్‌ల నుంచి కులంకాలమ్‌ను శాశ్వతంగా తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది. విద్యార్థుల మధ్య ఎలాంటి కుల వివక్షకు తావులేకుండా సమానత్వాన్ని పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. చిన్న వయస్సులోనే పిల్లల మనస్సులలో కుల భావనలు ఏర్పడకుండా నిరోధించడానికే అడ్మిషన్ ఫామ్‌ నుంచి కులం కాలమ్ తొలగింపు నిర్ణయ ప్రధాన ఉద్దేశమని విద్యాశాఖ పేర్కొంది. పాఠశాల ప్రవేశాల సమయంలో కులం పేరు ప్రస్తావించాల్సిన అవసరం లేనప్పటికీ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం లభించే స్కాలర్‌షిప్స్, రిజర్వేషన్ల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగదని అధికారులు స్పష్టం చేశారు. అయితే, హిమాచల్ ప్రదేశ్ నిర్ణయం పట్ల అక్కడి విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. 

Post a Comment

0 Comments

Close Menu