Ad Code

కొండా సురేఖ బీసీ మంత్రి కాబట్టే కొందరు కావాలనే కుట్రలు చేస్తున్నారు : ఆలిండియా ఓబీసీ సంఘం

తెలంగాణ మంత్రి కొండా సురేఖకు ఆలిండియా ఓబీసీ సంఘం మద్దతు ప్రకటించింది. కొండా సురేఖకు అండగా ఉంటామని స్పష్టం చేశాయి. కొండా సురేఖ బీసీ మంత్రి కాబట్టే కొందరు కావాలనే కుట్రలు చేస్తున్నారని ఓబీసీ సంఘం విమర్శించింది. కొండా సురేఖ తన కుమార్తె చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినా నోటీసులిచ్చారని మండిపడింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చిన్నారెడ్డిలు వ్యతిరేకంగా మాట్లాడినా నోటీసులు ఇవ్వలేదని, అదే కొండా సురేఖ కుమార్తె మాట్లాడిన దానికి మాత్రం నోటీసులిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి కొండా సురేఖకు అన్యాయం జరిగితే మాత్రం రాహుల్‌ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించింది. కాంగ్రెస్‌లో కొందరు చెంచాలున్నారని, అందుకే ఈ తరహా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని దుయ్యబట్టింది.

Post a Comment

0 Comments

Close Menu