Ad Code

'సైబర్‌ సురక్ష పోర్టల్‌'ను ప్రారంభించిన సెబీ

సెబీ 'సైబర్‌ సురక్ష పోర్టల్‌'ను ప్రారంభించింది. సైబర్‌ భద్రతకు సంబంధించిన సర్క్యులర్లు, వ్యవస్థల్లోని భద్రతా లోపాలపై హెచ్చరికలు, సైబర్‌ ఘటనలకు సంబంధించిన విశ్లేషణలను ఒకేచోట అందించే వన్‌-స్టాప్‌ హబ్‌గా ఇది పనిచేస్తుందని సెబీ తెలిపింది. ''సెక్యూరిటీల మార్కెట్‌లో సైబర్‌ భద్రతకు సంబంధించిన కీలక పరిజ్ఞానాన్ని, సమాచారాన్ని పంచుకోవడానికి ఈ వేదిక సమగ్ర, కేంద్రీకృత కేంద్రంగా ఉపయోగపడుతుంది'' అని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పోర్టల్‌ ద్వారా మార్కెట్‌ భాగస్వాములు తాజా సైబర్‌ భద్రతా సర్క్యులర్లు, భద్రతా లోపాలపై హెచ్చరికలు, సైబర్‌ ఘటనలకు సంబంధించిన వివరాలను నేరుగా పొందవచ్చని సెబీ తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu