ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుకు రోడ్డు యాక్సిడెంట్ కేసులో బెయిల్ మంజూరు కావడంతో ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ రోడ్డు యాక్సిడెంట్ కేసును నేరపూరితమైన హత్య అంటూ తనను కూటమి నాయకులు జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై పెట్టిన కేసు అక్రమమంటూ రాష్ట్రం ఆ చివర నుంచి ఈ చివరి వరకూ ప్రతి వైసీపీ కార్యకర్త గొంతెత్తి మాట్లాడారని చెప్పారు. పిల్లల మీద రాజకీయాలేంటని రాజకీయాలను దగ్గరగా పరిశీలించే అన్ని వర్గాల వాళ్లు ప్రశ్నించారు. పిల్లలు, కుటుంబాలపై కక్ష సాధింపు అని గొంతెత్తి మాట్లాడటం చాలా బాగా అనిపించిందని అప్పలరాజు భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. తనకు ఇంత పెద్ద కుటుంబాన్ని జగన్ మోహన్ రెడ్డి ఇచ్చారని, కళ్లారా చూసిన తర్వాత చాలా గర్వంగా అనిపించిందని అప్పలరాజు తెలిపారు.
0 Comments