టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సంస్థలపై సైబర్ దాడి జరిగిందనే వార్తలు తీవ్ర కలకలం రేపాయి. డార్క్ వెబ్‌లో ఉద్యోగుల డేటా లీక్ అయినట్లు వచ్చిన కథనాలపై ఈ రెండు కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు అధికారికంగా స్పష్టత ఇచ్చాయి. హెచ్‌సీఎల్ టెక్ స్పష్టత మరియు దర్యాప్తు సైబర్ దాడి వార్తలపై తమ డిజిటల్ సిస్టమ్స్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశామని, కంపెనీ అంతర్గత వ్యవస్థలకు గానీ, క్లయింట్ సిస్టమ్స్‌కు గానీ ఎలాంటి భంగం కలగలేదని స్పష్టం చేసింది.లీక్ అయినట్లు చెబుతున్న సమాచారం చాలా తక్కువ పరిమాణంలో ఉందని, అది కూడా కొన్నేళ్ల నాటి పాత డేటా అని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై సైబర్ నిపుణులతో పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందని, ఏవైనా కీలక ఆధారాలు లభిస్తే వెల్లడిస్తామని యాజమాన్యం తెలిపింది. సాంకేతిక భద్రత కొన్ని థ్రెట్ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు వచ్చినప్పటికీ, సిస్టమ్స్‌లో ఎలాంటి అనధికారిక ప్రవేశం జరగలేదని టీసీఎస్ స్పష్టం చేసింది.ఒకవేళ ప్రాథమిక వివరాలు బయటకు వచ్చి ఉంటే, అవి 4 ఏళ్ల కిందటి పాత ఉద్యోగుల సమాచారం మాత్రమే అయి ఉంటుందని పేర్కొంది. క్లయింట్ల డేటా, ప్రధాన ఆపరేషనల్ సిస్టమ్స్ పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని, 'పాస్‌వర్డ్ స్ప్రే', 'ఎంఎఫ్ఎస్ ఫెటీగ్' వంటి దాడులను అడ్డుకోవడానికి తమ వద్ద రెండేళ్లుగా బలమైన భద్రతా వ్యవస్థలు అమల్లో ఉన్నాయని తెలిపింది.
0 Comments