Ad Code

చిన్నారెడ్డి వివరణతో సంతృప్తి చెందలేదు !


చిన్నారెడ్డి ఇచ్చిన వివరణతో తాను సంతృప్తి చెందలేదని వనపర్తి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పష్టం చేశారు. చిన్నారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. క్రమశిక్షణ కమిటీకి ఆడియో, వీడియో సమర్పించినట్లు ఆయన తెలిపారు. మళ్లీ కమిటీ పిలిస్తే తన వర్షన్‌ చెబుతానన్నారు. నిజమైన కాంగ్రెస్‌ నాయకులంతా పార్టీ వెంటే ఉన్నారని, కాంగ్రెస్‌ నాయకుడిని అని చెప్పుకునే చిన్నారెడ్డి బీఆర్‌ఎస్‌ నాయకులతో ఉంటున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నేతలతో సాన్నిహిత్యం కాంగ్రెస్ ప్రయోజనాలకా? వ్యక్తిగత ఆధిపత్యానికా? అంటూ ప్రశ్నించారు.

Post a Comment

0 Comments

Close Menu