Ad Code

శ్రీకాకుళం నుంచి సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రికి గ్రీన్‌ చానల్‌ ద్వారా ఊపిరితిత్తులను రవాణా

శ్రీకాకుళం నుంచి సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రికి గ్రీన్‌ చానల్‌ ద్వారా ఊపిరితిత్తులను రవాణా చేశారు. ఆదివారం మధ్యాహ్న శ్రీకాకుళం నుంచి రోడ్డు మార్గం ద్వారా విశాఖపట్నం జెమ్స్‌ ఆస్పత్రికి చేరిన ఊపిరితిత్తులను అక్కడి నుంచి విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ఇండిగో 6ఈ- 783 విమానంలో అక్కడి నుంచి 4.12 గంటలకు బయలుదేరి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు 5.11 గంటలకు చేరుకున్నాయి. సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు, ఆర్‌జీఐఏ ట్రాఫిక్‌ పోలీసుల సహకారంతో ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లో వెంటనే తీసుకెళ్లి ఆర్గాన్స్‌ను ట్రాఫిక్‌ క్లియరెన్స్‌ చేస్తూ 30 నిమిషాల్లో సికింద్రాబాద్‌ కిమ్స్‌కు చేర్చారు.

Post a Comment

0 Comments

Close Menu