Ad Code

గజరాజుల ప్రాణాలు కాపాడిన అటవీ శాఖ సిబ్బంది

స్సాం లోని నాగావ్ ప్రాంతంలో ముప్పై ఏనుగుల గుంపు రైల్వే ట్రాక్ దాటుతున్న సమయంలో భారీ ప్రమాదం తృటిలో తప్పింది. అదే మార్గంలో వేగంగా వస్తున్న రాజధాని ఎక్స్ ప్రెస్ రైలును అటవీ సిబ్బంది సకాలంలో గుర్తించి అప్రమత్తమయ్యారు. వెంటనే రైలు ఎదురుగా వెళ్ళి లోకో పైలట్ కు ప్రమాద హెచ్చరిక సిగ్నల్ చూపించారు. లోకో పైలట్ స్పందించి క్షణాల వ్యవధిలో రైలు వేగాన్ని తగ్గించి నిలిపివేయడంతో ఏనుగులు సురక్షితంగా ట్రాక్ ను దాటాయి. అటవీ శాఖ అధికారుల చొరవ మూలంగా మూగజీవాల ప్రాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ సంఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.

Post a Comment

0 Comments

Close Menu