ముంబైలో వినాయక చవితి నేపథ్యంలో భారీ వినాయక విగ్రహాన్ని మండపానికి తరలిస్తుండగా ప్రమాదవశాత్తూ ఆ విగ్రహం కుప్పకూలి ఒక్కసారిగా అక్కడున్న జనంపై పడటంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు వినాయక చవితి సంబరాలకు సిద్ధం అవుతున్నారు. ముంబైలో ఏటా గణేశ్ నవ రాత్రుల్ని ఘనంగా నిర్వహిస్తుంటారు. ముంబైలో గల్లీ గల్లీలో పదుల సంఖ్యలో గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేస్తుంటారు. ఈ క్రమంలో దక్షిణ ముంబై భూలేశ్వర్ లోని బలరామ్ మర్చంట్ రోడ్డులో ఏటా వినాయక చవితి ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారు. అయితే ఈ సారి కూడా దాదాపు 20 రోజుల ముందు నుంచే అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి పది గంటల సమయంలో 22 అడుగుల ఎత్తైన భూలేశ్వరచా రాజా వినాయక విగ్రహాన్ని స్థానిక మండపానికి వాహనంలో తరలించేందుకు సిద్దం అయ్యారు. డీజే పాటలతో వినాయకుడిని మండపానికి తీసుకొస్తున్నారు. అక్కడ జనం రద్దీతో కోలాహలంగా వాతావరణం ఉంది.
0 Comments