ఆగస్టు 25న హిందుస్థాన్ కాపర్ సంస్థ ఆఫర్ ఫర్ సేల్ లాంచ్ చేసింది. తొలుత 3 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయించగా, దానికి తొలి రోజు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ లభిస్తే వినియోగించేందుకు అదనంగా గ్రీన్ షూ ఆప్షన్ కింద ఉంచిన మరో 3 శాతం వాటాను కూడా ఇవాళ ఓఎఫ్ఎస్ కింద అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. దీంతో పూర్తిగా 6 శాతం వాటా విక్రయిస్తుంది. ఆఫర్ ఫర్ సేల్ తొలి రోజు సంస్థాగత మదుపరులు బిడ్డింగ్స్ కోసం అందుబాటులో ఉండగా, ఈ రోజే రిటైల్ ఇన్వెస్టర్లు దీనిలో పార్టిసిపేట్ చేసేందుకు వీలు కల్పిస్తోంది. వీరి కోసం దాదాపు 10 శాతం వాటాను అందుబాటులో ఉంచింది. గ్రీన్ షూ ఆప్షన్ వినియోగిస్తున్నందున నాన్ రిటైల్ ఇన్వెస్టర్లు ఇవాళ మళ్లీ బిడ్డింగ్స్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. నిన్న అంతకుముందటి రోజు క్లోజింగ్ ప్రైస్‌తో పోలిస్తే దాదాపు 10 శాతం డిస్కౌంట్‌తో రూ. 514 తో కొనేందుకు ఛాన్స్ కల్పించింది. ఇదే ఫ్లోర్ ప్రైస్‌గా నిర్ణయించింది. ఇక తొలి రోజు సంస్థాగత మదుపరుల కోసం మొత్తం 2.61 కోట్ల షేర్లను అందుబాటులో ఉంచితే ఇష్యూ ఏకంగా 3.41 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. మొత్తం 8.91 కోట్ల షేర్లకు బిడ్స్ వచ్చాయి. వీటి విలువ దాదాపు రూ. 4600 కోట్లుగా ఉందని తెలుస్తోంది. అంటే షేర్లు దక్కించుకునేందుకు విపరీతంగా పోటీపడ్డారని చెప్పొచ్చు. ఇప్పుడు మరో 3 శాతం వాటాకు సమానమైన మరో 2,90,10,721 కోట్ల ఈక్విటీ షేర్లను కూడా గ్రీన్ షూ ఆప్షన్ కింద ఇవాళ అందుబాటులోకి తీసుకొస్తోంది. మొత్తం 5.80 కోట్ల షేర్ల విక్రయం ద్వారా ప్రభుత్వం సుమారు రూ. 3 వేల కోట్ల వరకు నిధుల్ని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
0 Comments