Ad Code

తిరుమలలో భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఈ-వేలం

గస్టు 17 నుంచి 19 వరకు తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఈ-వేలం ద్వారా వేలం వేయనున్నారు. ఈ వేలంలో 177 లాట్లలో కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు అందుబాటులో ఉంటాయి. టర్కీ టవళ్లు, ఆర్డినరీ టవళ్లు, లుంగీలు, శాలువాలు, బెడ్‌షీట్లు, దిండుకవర్లు, న్యాప్‌కిన్లు, హ్యాండ్‌కర్చీఫ్‌లు, పిల్లో కవర్లు, బ్లౌజ్‌పీస్‌లు, దుపట్టాలు, పరదాలు, హుండీ గలీబులు, ఈర్వాడాలు తదితర వస్త్రాలను ఈ-వేలంలో విక్రయిస్తారు. వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయం (వేలములు) 0877-2264429ను సంప్రదించవచ్చు. అలాగే www.konugolu.ap.gov.in మరియు www.tirumala.org వెబ్‌సైట్లలో వివరాలు తెలుసుకోవచ్చు.


Post a Comment

0 Comments

Close Menu