దేశీయ మార్కెట్లో ఏసర్ రీసెంట్ విడుదల చేసిన 2025 నిట్రో సిరీస్ 75 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ అందించిన 57% భారీ డిస్కౌంట్ తో అందిస్తోంది. ఈ బిగ్ డిస్కౌంట్ కాకుండా ఈ స్మార్ట్ టీవీపై రూ. 4,200 రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 49,799 ప్రైస్ లో లభిస్తుంది. ఈ లేటెస్ట్ 75 అంగుళాల స్మార్ట్ టీవీ కేవలం 55 అంగుళాల స్మార్ట్ టీవీ ధరకే లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 75 ఇంచ్ బిగ్ క్యూలెడ్ స్క్రీన్ తో వస్తుంది. ఇది 4K UHD రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, మంచి బ్రైట్నెస్ డాల్బీ విజన్ మరియు HDR 10 సపోర్ట్ వంటి ఫీచర్స్ తో ఆకట్టుకునే విజువల్స్ ఆఫర్ చేస్తుంది. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది మరియు జతగా 2జీబి ర్యామ్ అండ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఇది బెజెల్ లెస్ డిజైన్ మరియు స్టాండ్ సెటప్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్ సపోర్ట్ తో వస్తుంది. ఇందులో స్పీకర్లు మరియు ట్వీటర్ సెటప్ కూడా అందించింది. ఈ టీవీ టోటల్ 50w అవుట్ పుట్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 OS తో నడుస్తుంది. ఈ టీవిలో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi బ్లూటూత్, బిల్ట్ ఇన్ క్రోమ్ క్యాస్ట్, ఈథర్నెట్ పోర్ట్, HDMI, USB మరియు ఆప్టికల్ అవుట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.
0 Comments