జర్మనీ సహకారంతో 6 అత్యాధునిక సాంప్రదాయ జలాంతర్గాముల నిర్మించే ప్రాజెక్ట్ 75(1) త్వరలోనే కేంద్ర కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ ముందుకు వెళ్లనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్టు విలువ సుమారు రూ.70,000 కోట్లుగా చెబుతున్నారు. ఈ సబ్‌మెరైన్లను జర్మనీ సహకారంతో భారత్‌లోనే నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ముంబైకి చెందిన మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్), జర్మనీకి చెందిన థెసెస్‌క్రుప్ మెరైన్ సిస్టమ్స్ (టీఎంకేఎస్) సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులో జర్మనీ నుంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నిర్మాణ అనుభవం భారత్ పొందనుంది. ముఖ్యంగా జలాంతర్గాములు నీటి అడుగున ఎక్కువ సేపు పనిచేసే సామర్థ్యాన్ని పెంచే ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపెల్షన్ వ్యవస్థ కీలకంగా కానుంది. ఈ ప్రాజెక్టుపై చాలాకాలంగా చర్చలు కొనసాగుతున్నప్పటికీ వాణిజ్య నిబంధనలు, సాంకేతక వివరాలు వంటి కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది.ఈ నేపథ్యంలో తాజా ప్రతిపాదపై తుది నిర్ణయం కోసం కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ముందుంచే ప్రక్రియ వేగవంతమైనట్టు తెలుస్తోంది. టీకేఎంఎస్ సైతం యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్ సిస్టం కోసం ముంబైకి చెందిన సీఎఫ్‌ఎఫ్ ఫ్యూయిడ్ కంట్రోల్‌తో భాగస్వామం పెట్టుకోవడంతో పాటు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ)తో సహా పలు భారత సంస్థలతో భాగస్వామ్యానికి ఆసక్తితో ఉంది.
0 Comments