తొలి ఎలక్ట్రిక్ విమాన పరీక్ష విజయవంతం : బ్యాటరీ విద్యుత్‌తో 27 నిమిషాల పాటు గాల్లో ప్రయాణించిన విమానం

లక్ట్రిక్ విమానం విజయవంతంగా తొలి ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. స్వీడన్‌కు చెందిన హార్ట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన 30 సీట్ల X1 విమానం బ్యాటరీ విద్యుత్‌తోనే 27 నిమిషాల పాటు గాల్లో ప్రయాణించింది. న్యూయార్క్‌లోని ప్లాట్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి నిర్వహించిన ఈ ప్రయోగాత్మక విమానంలో ప్రయాణికులు ఎవరూ లేరు. కేవలం ఒక పైలట్ మాత్రమే విమానాన్ని నడిపారు. సుమారు 25,000 పౌండ్ల బరువు ఉన్న X1 విమానం 106 అడుగుల రెక్కల విస్తీర్ణం కలిగి ఉంది. బ్యాటరీ పవర్‌తోనే ప్రయాణించిన విమానం గరిష్ఠంగా 1,100 అడుగుల ఎత్తుకు చేరుకుంది. X1 విమానం పూర్తిగా బ్యాటరీ-ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వ్యవస్థతో పనిచేస్తుందని హార్ట్ ఏరోస్పేస్ తెలిపింది. ఈ వ్యవస్థ 1 మెగావాట్‌కు పైగా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయగలదని కంపెనీ వెల్లడించింది. తొలి ప్రయాణంపై హార్ట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు, సీఈఓ అండర్స్ ఫోర్స్‌లండ్ స్పందిస్తూ.. వాణిజ్య విమానాల స్థాయిలో ఎలక్ట్రిక్ విమాన ప్రయాణం సాధ్యమేనని X1 తొలి ఫ్లైట్ నిరూపించిందని అన్నారు. ఎలక్ట్రిక్ వాణిజ్య విమానాలు భవిష్యత్తులో విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాలను గణనీయంగా మార్చగలవని, తద్వారా ప్రయాణికులకు విమాన ప్రయాణ ఖర్చులు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. X1 ప్రయోగాత్మక విమాన ప్రయాణంలో వినియోగించిన విద్యుత్‌కు అయిన ఖర్చు సుమారు 5 డాలర్లు మాత్రమేనని కంపెనీ తెలిపింది. అంటే 27 నిమిషాల ప్రయాణానికి విద్యుత్ బిల్లు భారత కరెన్సీలో సుమారు రూ.400-450 మధ్య ఉన్నట్లు చెప్పొచ్చు. అయితే ఇది కేవలం విమానం వినియోగించిన విద్యుత్‌కు సంబంధించిన ఖర్చు మాత్రమే. పైలట్ జీతం, నిర్వహణ, విమానాశ్రయ ఫీజులు, బ్యాటరీ క్షీణత, బీమా, ఆర్థిక వ్యయాలు వంటి ఇతర నిర్వహణ ఖర్చులు ఇందులో లేవు. X1 ప్రయోగం చిన్న వాణిజ్య విమానం స్థాయిలో బ్యాటరీ-ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ పనిచేయగలదని నిరూపించినప్పటికీ.. ప్రస్తుతం కొన్ని సవాళ్లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బ్యాటరీ బరువు, విమానం ప్రయాణించగల దూరం (రేంజ్) వంటి పరిమితుల కారణంగా పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ విమానాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా జెట్ ఇంధన ధరల్లో పెరుగుతున్న అస్థిరత నేపథ్యంలో ఎలక్ట్రిక్ విమానాలపై ఆసక్తి పెరుగుతోంది. చమురు ధరలపై ఆధారపడకుండా తక్కువ నిర్వహణ వ్యయాలతో విమానాలను నడిపే అవకాశం ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ ద్వారా లభించవచ్చని హార్ట్ ఏరోస్పేస్ పేర్కొంది.

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains