Ad Code

ఒడిశా తీరంలో పనామాకు చెందిన కార్గో షిప్ మునక : 22 మంది గల్లంతు, ఇద్దరిని రక్షించిన ఇండియన్ నేవీ

డిశా తీరంలో పనామాకు చెందిన కార్గో నౌక మునిగిపోయింది. ఈ ఘటనలో నౌకలోని 22 మంది సిబ్బంది గల్లంతయ్యారు. పనామాకు చెందిన కార్గో నౌక సింగపూర్ వెళ్తుండగా ఒడిశా తీరంలో ప్రమాదవశాత్తు మునిగిపోయింది. ఒడిశా తీరంలోని పారదీప్‌నకు 240 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో నౌకలోని 22 మంది గల్లంతయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న ఇండియన్ నేవీ, కోస్ట్‌గార్డ్ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. నౌకకు చెందిన ఇద్దరిని రక్షించారు. గల్లంతైన 22 మంది కోసం గాలిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇండియన్ కోస్ట్ గార్డ్ స్పందించింది. పనామాకు చెందిన ఎంవీ ఓషన్ విన్నర్ అనే నౌకతో సంబంధాలు తెగిపోయినట్లు సమాచారం అందిందన్నారు. నౌకలో 20 మంది చైనా వాసులు, ముగ్గురు మయన్మార్ పౌరులు, ఒక బంగ్లాదేశ్ పౌరుడు ఉన్నారు. ఒడిశా నుంచి ఈ నౌక ఐరన్ ఓర్ లోడ్‌తో శుక్రవారం సింగపూర్ బయల్దేరింది. నౌక మునిగిపోవడానికి కొద్దిసేపు ముందు సంబంధాలు తెగిపోయాయి. ప్రస్తుతం ఇండియన్ నేవీ, కోస్ట్‌గార్డ్ సంయుక్తంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu