Ad Code

హాకీ ప్రపంచకప్ : 2-2తో డ్రా చేసిన భారత జట్టు

హిళల హాకీ ప్రపంచకప్‌ను భారత్ డ్రాతో ప్రారంభించింది. ఆదివారం పూ-డిలో బలమైన చైనాతో జరిగిన మ్యాచ్‌ను సలీమా బృందం 2-2తో డ్రా చేసుకుంది. భారత్ తరఫున నవనీత్ కౌర్ (8వ నిమిషం) తొలి గోల్ చేసింది. తొలి క్వార్టర్ ముగుస్తుందనగా చైనా స్కోర్‌ను సమం చేసింది. జాంగ్ యింగ్ 14వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్ ద్వారా గోల్ చేసింది. అయితే రెండో క్వార్టర్‌లో పెనాల్టీ కార్నర్‌ను దీపిన (26వ నిమిషం) గోల్‌గా మలవడంతో భారత్ మళ్లీ ఆధిక్యంలోకి వెళ్లింది. చైనా క్రీడాకారిణి మా నింగ్ 39వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌తో గోల్ చేయడంతో మళ్లీ స్కోర్ సమం అయింది. చివరి క్వార్టర్‌లో ఇరు జట్లు గోల్ చేయలేకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

Post a Comment

0 Comments

Close Menu