ఐర్లాండ్‌లో 19వ శతాబ్ధం నాటి ఈ బంగళాను మెటా కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, ప్రిసిల్లా దంపతులు 30 మిలియన్ యూరోలు అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 335 కోట్లు వెచ్చించి కొన్నట్టు సమాచారం. 'స్ట్రాన్‌కల్లి క్యాసిల్'గా పిలిచే ఈ భవంతి ఏకంగా 440 ఎకరాల సువిశాలమైన ఎస్టేట్‌లో విస్తరించి ఉంది. సోషల్ మీడియా సంస్థలతో కోట్లు ఆర్జిస్తున్న మార్క్ జుకర్‌బర్గ్ తన రేంజ్‌కు తగ్గట్టే ఈ లగ్జరీ భవంతిని దక్కించుకున్నారు. జుకర్‌బర్గ్ ఎక్కువగా అమెరికాలోనే ఉంటారు. కానీ, ఐర్లాండ్‌లో మెటా ఆఫీస్ ఉంది కాబట్టి, ఆయన ఆ దేశానికి వెళ్లినప్పుడు లగ్జరీ భవంతిలోనే ఉండాలని అనుకుంటున్నారు. డబ్లిన్‌లోని మెటా కార్యాలయానికి సమీపంలోనే ఈ భవనం ఉంది. మెటా అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం అదే కావడంతో, ఐర్లాండ్‌కు వెళ్లినప్పుడు గడపడానికి జుకర్‌బర్గ్ కుటుంబం దీనిని ఎంచుకుంది. ఈ లగ్జరీ భవంతిని 200 ఏళ్ల క్రితం జాన్ కైలీ అనే వ్యక్తి కట్టించారు. ఆ తర్వాత మైఖేల్, గియాంకార్లా అనే దంపతులు దీనిని కొనుగోలు చేసారు.లగ్జరీ భవంతిలో 3 అంతస్తులు, 11 పడక గదులు ఉన్నాయి. ఇది ఐర్లాండ్ వాటర్‌ఫోర్డ్ కౌంటీలోని ఒక నది ఒడ్డున ఉంది. చుట్టూ దట్టమైన చెట్లు, పచ్చని గడ్డి మైదానాలతో చూడటానికి ఇదొక అందమైన అడవిలా ఉంటుంది.
0 Comments